Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి
నవతెలంగాణ- రామన్నపేట
కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వేగవంతంగా కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని సిరిపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సందర్శించారు. ధాన్యం రాశులను, కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం పోసి ఇరవై రోజులు గడుస్తున్నా సకాలంలో లారీలు రాక కొనుగోలు మందకోడిగా సాగుతున్నాయన్నారు. సిరిపురం కొనుగోలు కేంద్రంలో 180 రాసులకు కేవలం 15 మాత్రమే ఇప్పటివరకు కాంట పెట్టారాన్నారు. ఇంకా 165 రాశులు కాంట పెట్టాలంటే సుమారుగా రెండు నెలలు దాటుతుందన్నారు. వానకాలం వస్తుందని, పెట్టుబడులెలా పెడతారని ఆయన ప్రశ్నించారు. తాలు పేరుతో రైస్ మిల్లర్లు షరతులు పెట్టడంతో రైతులు ధాన్యం తూర్పార పట్టేందుకు ఫ్యాన్ మిషన్, కూలీలను పెట్టి అదనంగా ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట వేసిన 48 గంటల్లో రైతు ఖాతాలో డబ్బులు జమచేయాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో తడిసిన దాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మెన్్ అంబటి ఉపేందర్, రవీందర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం, ఎంపీటీసీ బడుగు రమేష్, మండల కమిటి సభ్యులు బల్గూరి అంజయ్య, రైతు నాయకులు అంబటీ సురెందర్ రెడ్డి, దోమలపల్లి నర్సింహ్మ, కూనూరు వేంకటేశం, కూనూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు.