Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చండూరు
నిరుద్యోగ యువకుడు పాక శ్రీకాంత్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఏ.విజరు కుమార్ అన్నారు. గురువారం పుల్లెంల గ్రామంలో శ్రీకాంత్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. శ్రీకాంత్చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే కొలువులు వస్తాయని ఆశించిన యువతకు నిరాశే మిగిలిందన్నారు.ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ బయట ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కరోనా పరిస్థితుల్లో ఎక్కడా కొలువు దొరక్కపోవడం, నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో తమ్ముడి చదువుకు ఫీజు చెల్లించేందుకు డబ్బు లేకపోవడంతో శ్రీకాంత్ ఆవేదన చెందాడన్నారు. ఈ క్రమంలో పురుగుల మందుతాగి తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ప్రభుత్వం బాధ్యత వహించి శ్రీకాంత్ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్తీక్, సంపత్ , బబ్బి ,మధు, వంశీ, శివ సాయి తదితరులు పాల్గొన్నారు.