Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
కరోనా విజంభిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ ట్రిబ్యునల్స్ రివ్యూ పిటిషన్ వాదనలు వాయిదా వేయాలని భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోదా వెంకటేశ్వర్లు కోరారు. గురువారం బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బాడీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ విజంభిస్తున్న సమయంలో న్యాయవాదులు ఎక్కువమంది భయపడి ఇంటికే పరిమితమవుతున్నారని తెలిపారు. న్యాయవాదులు మే 1 నుండి రివ్యూ పిటిషన్ పై వాదనలు వినిపించాలని కేసుల లిస్టు పంపడం తగదన్నారు. జూన్ 21 తర్వాత కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ సురకంటి జంగారెడ్డి, సహాయ కార్యదర్శి కుక్కదూగ కష్ణ, కోశాధికారి మల్లేశ్, స్పోర్ట్స్ సెక్రటరీ ఐలయ్య, సురేష్, మట్ట వెంకటేష్ పాల్గొన్నారు.