Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్గొండ
కరోనా కట్టడి చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఆ పార్టీ కార్యాలయంలో ఎదుట జెండాను ఆవిష్కరించారు. అనంతరం కోవిడ్‌కు బలైన పాత్రికేయులకు ,ఇతరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన మూడేళ్ల మాదిరిగానే భవిష్యత్తులోనూ ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మేకల శివ, విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు ధీరావత్ వీర నాయక్ తదితరులు పాల్గొన్నారు.