Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోదాడరూరల్
మండల పరిధిలోని యర్రవరం గ్రామంలో వేయనున్న సీసీ రోడ్డు, డ్రయినేజీ నిర్మాణ పనులకు ఎంపీపీ చింతా కవితా రాధారెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మంజూరైన రూ.2 లక్షలతో వీటిని నిర్మిస్తున్నట్టు చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుబ్బారావు, టీఆర్ఎస్ నాయకులు వరదారావు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సర్పంచ్ కుటుంబానికి పరామర్శ
మండల పరిధిలోని రామలక్ష్మీపురం సర్పంచ్ పాముల మస్తాన్ కుమారుడికి కుడి కాలు తొలగించారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ కవితా రాధారెడ్డి గురువారం పరామర్శించారు. అధైర్య పడాల్సిన అవసరం లేదని, తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.