Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అనంతగిరి
ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరపొద్దని తహసీల్దార్ విజయలక్ష్మి హెచ్చరించారు. గురువారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ మండల పరిధిలోని శాంతినగర్ గ్రామంలో సర్వే నెంబర్ 778లో గల ప్రభుత్వ భూముల్లో కొంతమంది అక్రమంగా మట్టి తవ్వుతున్నట్టు సమాచారం అందిందన్నారు. వెంటనే సిబ్బందితో కలిసి వెళ్లి బీసీబీ, ట్రిప్పర్ వాహనాలను సీజ్ పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా తవ్వకాలు జరిపితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ వాజిద్అలీ, సీనియర్ అసిస్టెంట్ జానకీరాంరెడ్డి, ఆర్వో గిరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.