Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెన్కో సీఈ సూర్యనారాయణ
నవతెలంగాణ - నాగార్జున సాగర్
విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగీ విధిగా కరోనా నిబంధనలు పాటించాలని జెన్కో సీఈ సూర్యనారాయణ కోరారు. పైలాన్కాలనీలోని జెన్కో కార్యాలయంలో గురువారం 1535 యూనియన్ రీజినల్ ప్రెసిడెంట్ లవకుమార్ ఆధ్వర్యంలో సుమారు 480 మంది విద్యుత్ అధికారులు, కార్మికులకు ఎస్ఈ రఘురామ్, సివిల్ ఎస్ఈ రామకృష్ణారెడ్డితో కలిసి మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. కరోనాపై అవగాహన కల్గి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రీజినల్ జనరల్ సెక్రెటరీ ఎం.శేఖర్, బత్తుల రాజు, పాశం నాగరాజు, సీహెచ్.నరేష్, కార్మికులు పాల్గొన్నారు.