Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
పేదల సమస్యలపై నిరంతరం పరితపించిన ముదిరెడ్డి ఆదిరెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక అమరవీరుల స్మారక భవనంలో పార్టీ మండల కార్యదర్శి దేవరం వెంకట్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఆదిరెడ్డి 24వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. ఆదిరెడ్డి నర్సింహులగూడెం సర్పంచ్‌గా పని చేసి ప్రజలకు సేవలందించారని గుర్తు చేశారు. యువజన రైతు సంఘం నాయకునిగా, డివిజన్ కమిటీ సభ్యులుగా పని చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని తెలిపారు. ఆదిరెడ్డి పేదల పక్షాన చేస్తున్న పోరాటాలను జీర్ణించుకోలేని కాంగ్రెస్ నరహంతక ముఠా దారికాచి వేట కొడవళ్లతో ఆయన్ను అతి కిరాతంగా నరికి హత్య చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కొక్కిరేణి సింగిల్ విండో చైర్మెన్ చందా చంద్రయ్య, మండల కమిటీ సభ్యులు బోనాల మంగయ్య, శాఖ కార్యదర్శి కిన్నెర వెంక న్న, డీవైఎఫ్ఐ నాయకులు గడ్డం వినోద్ పాల్గొన్నారు.
కోదాడరూరల్ : పోరాట యోధుడు ముదిరెడ్డి ఆదిరెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ముత్యాలు కోరారు. ఆదిరెడ్డి 24వ వర్థంతి సందర్భంగా గురువారం పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తా వద్ద ఆదిరెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం భూములు పంపిణీ చేసిన వ్యక్తి ఆదిరెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి శ్రీనివాస్, నవీన్‌కుమార్, వెంకటేశ్వర్లు, గాంధీ దేవరాజు, శివ పాల్గొన్నారు.