Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకవీడు
కరోనా కాలంలో పేదలు, వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీపీఐ(ఎం), వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందగట్ల అనంతప్రకాశ్ మాట్లాడుతూ కరోనా కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.వ్యవసాయ కార్మికులు, పేదప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమ యంలో పనుల్లేక పేదలు, వ్యవసాయకూలీలు తీవ్ర ఇబ్బంది పడు తున్నారని, ఉపాధి హామీ పనులు చేపట్టి 200 రోజులు పనులు కల్పించి రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ అందించాలని కోరారు.మండల కేంద్రంలో వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.వీటితో పాటు 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీఓకు అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో పీఏసీఎస్ వైస్చైర్మెన్ పగడాల మట్టేశ్, మీసాల సోములు, దాసరి సైదులు, అంజి ఉన్నారు.