Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
కరోనా కాలంలో పట్టణంలో ఉపాధిహామీ చట్టాన్ని అమలు చేసి వ్యవసాయ కార్మికులకు పనులు కల్పిం చాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యుడు ములకలపల్లి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం మున్సిపాలిటీ కార్యా లయంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కమిషనర్ నాగేంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు.అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా ఉధృతం అవుతుండడంతో పట్టణాలు, గ్రామాల్లో వ్యవసాయ కూలీలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతు న్నారన్నారు.మున్సిపాలిటీలలో కూడా ప్రభుత్వం ఉపాధి హామీచట్టాన్ని ప్రారంభించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు వెలది పద్మావతి, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ముత్యాలు, షేక్నాజర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.