Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వలిగొండ
స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేసే డాక్టర్లు కిరణ్, సుమలతను హైదరాబాద్‌కు డిప్యూటేషన్‌పై పంపడాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో డిప్యూటేషన్ కాపీలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి కూర శ్రీనివాస్, గర్దాస్ నరసింహ మాట్లాడుతూ మండలంలో కరోనా కేసులు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో సిబ్బందిని పెంచాల్సిన ప్రభుత్వం ఉన్న ఇద్దరు డాక్టర్లను డిప్యూటేషన్‌పై పంపడం దారుణమన్నారు. వెంటనే డిప్యూటేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధ్యానబోయిన యాదగిరి, వేముల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
మోత్కూరు : స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కిషోర్ కుమార్ డిప్యూటేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యాధికారిని డిప్యుటేషన్‌పై హైదరాబాద్‌కు పంపడం సరికాదన్నారు.
తుర్కపల్లి : స్థానిక ప్రాథమిక ఆరోగ్యం వైద్యులు చంద్రారెడ్డిని డిప్యూటేషన్‌పై పంపే నిర్ణయాన్ని వెంటనే ఆపాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ మాట్లాడుతూ జిల్లాలోని ఎనిమిది మంది వైద్యులను డిప్యూటేషన్‌పై పంపడం సరికాదన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టుల కోసం ప్రతి రోజూ అనేక మంది బాధితులు వస్తూ ఉన్నారని, ఉన్న ఇద్దరు వైద్యుల్లో ఒకరికి పంపించడం ఏంటని ప్రశ్నించారు. వినతి పత్రం అందజేసిన వారి లో నాయకులు కొండ లింగయ్య ఉన్నారు.