Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21,382 ఓట్లకు గాను 18,528 ఓట్లు నమోదు
- కట్టుదిట్టంగా కోవిడ్ నిబంధనలు అమలు
- ఎన్నికలను పరిశీలించిన కలెక్టర్ జె.పాటిల్
నవతెలంగాణ - నకిరేకల్
నకిరేకల్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. మున్సిపాలిటీలో మొత్తం 21,382 మంది ఓటర్లు ఉండగా 18528 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 9173 మంది పురుషులు, 9355 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తంగా 86.65 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకూ 21.06 శాతం, 11 గంటల వరకు 45.55 శాతం, ఒంటి గంట వరకూ 65.7 శాతం, మూడు గంటల వరకూ 76.61 శాతం, 5 గంటల వరకూ 86.65 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికలు కోవిడ్ నిబంధనల మేరకు నిర్వహించారు. ఓటర్లకు శానిటైజ ర్ చేస్తూ టెంపరేచర్ పరిశీలిం చిన తర్వా తే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించారు.
ఎన్నికలను పరిశీలించిన అధికారులు
నకిరేకల్ మున్సిపల్ ఎన్నికలను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డిఐజి ఏవి రంగనాథ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎన్నికల పరిశీలకులు వాకాటి కరుణ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లను మాస్కు ధరించాలని సూచించారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజాప్రతినిధులు
నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ నేతి విద్యాసాగర్ ఉర్దూ మీడియం పాఠశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు పట్టణంలోని కేంద్ర ప్రాథమిక పాఠశాలలో, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగిం చుకున్నారు.