Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్టౌన్
కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడు కునేందుకు మరో పోరాటానికి సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీతల రోషపతి కోరారు.శుక్రవారం పట్టణంలోని సీఐటీయూ కార్యాలయం వద్ద రైస్ మిల్లు దినకూలీల గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు.అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాసేందుకు సిద్ధమైందన్నారు కార్మికుల సంక్షేమానికి చేయూత అందించాల్సిన పాలకులు కార్పొరేటర్లకు తొత్తులుగా మారి పాలన సాగిస్తు న్నారని విమర్శించారు.ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను కరోనా నిబంధనలు పాటిస్తూ ఎక్కడికక్కడ కార్మిక వాడల్లో జెండాలు ఎగుర వేయాలని కోరారు. రైస్ ఇండిస్టీలోని రైస్ మిల్ డ్రైవర్లకు, కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు ఉచితంగా ఆందజేయాలని కోరారు.ఈ సమావేశంలో సామల కోటమ్మ, వెంకమ్మ, గోవిందమ్మ, ముని, మంగమ్మ, పద్మ, భేగం పాల్గొన్నారు.