Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
గ్రామపంచాయతీ కేంద్రంగా ఉపాధిహామీ కూలీలందరికీ టీకాలు వేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య డిమాండ్ చేశారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం నల్లగొండ ఎంపీడీవో కార్యాలయం కార్యాల యం ఎదుట నిరసన తెలిపారు. సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ రూ.7500 ఆర్థిక సాయం ఆరు నెలల పాటు ఇవ్వాలన్నారు. ఉపాధిహామీ పనులు జరిగే ప్రాంతాల్లో నీడతో పాటు సరైన వసతులు కల్పించాలని కోరారు. కుటుంబంలో మనిషికి 20 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు ఉచితంగా అందించాలన్నారు. అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. ఉపాధి పనులు జరిగే చోట మొబైల్ టీంలు పంపి కరోనా టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు దండెంపల్లి సరోజ, జిల్లా కమిటీ సభ్యులు నలపరాజు సైదులు, సభ్యులు జిల్లపల్లి కాశయ్య, అంజయ్య, త్రిపురాంభ తదితరులు పాల్గొన్నారు.