Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
మండలంలోని చిన్నకాపర్తి, బోయ గుబ్బ, మొర్సుగూడెం గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు జరగడం లేదని, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఆయా గ్రామాల రైతులు శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 18 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాకు స్పందించిన తహసీల్దార్ కృష్ణారెడ్డి రైతులతో మాట్లాడారు. సమస్య పరిష్కరిస్తామని హామీనిచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు ఆకుల వెంకన్న, మెట్టు వెంకటేశం, మల్యాల నరేందర్, మోటో నరసింహ, ఎద్దుల తిరుమల రెడ్డి, మిరియాల శ్రీశైలం పాల్గొన్నారు.