Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు అన్నారు.శనివారం మండలపరిధిలోని ప్రతి గ్రామంలో వాడవాడలా పార్టీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలోని తొట్ల మల్సూర్ స్మారక భవనం ఆవరణంలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ కార్మికులంతా ఏకమై కార్మిక సమస్యల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.మోడీ అనుసరిస్తున్న కార్మికుల వ్యతిరేక విధానాలను ఖండించాలని కోరారు.లేబర్ యాక్ట్ రద్దుపై పోరాడాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కందాల శంకర్‌రెడ్డి, సీఐటీయూ మండల కార్యదర్శి బొజ్జ శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బత్తుల శ్రీను, ప్రజానాట్యమండలి జిల్లా సహాయ కార్యదర్శి పోలేపాక శ్రీను, మండల నాయకులు పులుసు ప్రహాల్లద, తొట్ల లింగయ్య, సామ వెంకట్‌రెడ్డి, బత్తుల ఈదయ్య, కట్ట నర్సిరెడ్డి, ముండ్ల సంజీవ, బత్తుల సోమయ్య, కందాల కష్ణారెడ,ి్డ పెద్దింటి జాన్‌రెడ్డి, పొలేపాక నగేష్, గజ్జల సాయిరెడ్డి, శ్రీనివాసరెడ్డి , గుణగంటి లింగయ్య, కుసు సైదులు, బాలకష్ణ, తిరుమలేష్, కామ పరమేశ్ పాల్గొన్నారు.
సీపీఐ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి తొట్ల ప్రభాకర్‌గౌడ్ మండలకేంద్రంలో జెండాను ఆవిష్క రించారు.ఈ కార్యక్రమంలో వెంకట్‌రెడ్డి, వీరన్న, రామ్మూర్తి, లింగయ్య, పూలమ్మ, అబ్బయ్య పాల్గొన్నారు. అదేవిధంగా సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మండలకేంద్రంతో పాటు మండలంలోని చిల్పకుంట్లలో పార్టీ సీనియర్ నాయకుడు పెద్దింటి రంగారెడ్డి జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో చిల్పకుంట్ల గ్రామ ఉప సర్పంచ్ జటంగి వీరమల్లు, నాయకులు గంటా నాగయ్య, దేశోజు మధు, మున్న అశోక్, మందడి భూపాల్‌రెడ్డి, గడ్డం శ్రీను, పాపయ్య పాల్గొన్నారు.
తిరుమలగిరి: మేడే సందర్బంగా మున్సిపాలిటీ కేంద్రం సుందరయ్యకాలనీలో మేడే ఉత్సవాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎర్రజెండాను ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో గణేష్, పడమటి నగేశ్, కటారి నర్సింహ, అంజి, కిరణ్, నర్సయ్య పాల్గొన్నారు.అదేవిధంగా మండలకేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మేడేజెండాను పార్టీ మండలకార్యదర్శి కడెం లింగయ్య ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో నిర్మల, యాకయ్య, కొండపైన లింగయ్య, మంజుల, వినోద, కొమురయ్య, నాగరాజు పాల్గొన్నారు.
చివ్వెంల : అమరుల త్యాగాలు ఎన్నటికీ మరువ లేనివని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు.మేడేను పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీను, లక్ష్మీ, అబ్బులు, భద్రయ్య, నర్సయ్య పాల్గొన్నారు.అదేవిధంగా జాజిరెడ్డిగూడెం గ్రామంలో శిగ వెంకన్న, దేవరకొండ బాలయ్య, మల్లయ్య, వీరయ్య, రవి, పిచ్చయ్య, శ్రీను, రాములు, విజయకుమార్ పాల్గొన్నారు.
మండలంలోని వివిధ గ్రామాలలో సీపీఐ(ఎం), సీపీఐల అధ్వర్యంలో అరుణపతాకం జెండాను ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గుద్దేటి చిన వెంకన్న, పార్టీ జిల్లా నాయకులు వేల్పుల వెంకన్న, సీనియర్ నాయకులు పల్లేటి వెంకన్న, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బచ్చలకూరి రామ్‌చరణ్, వార్డు సభ్యులు బిందుశేఖర్, గుద్దేటి పరుశురాం, సీపీఐ మండల కార్యదర్శి ఖమ్మం పాటి రాము, ఖమ్మంపాటి అంతయ్య, ఉప్పలయ్య, భవాని, లలిత, సుద్దగాని లింగయ్య, జటంగి వెంకన్న, జానయ్య పాల్గొన్నారు.
మునగాల: మండలంలోని వివిధ గ్రామాల్లో సీపీఐఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.పార్టీ నాయకులు అమరవీరుల స్తూపాల వద్ద జెండాలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు, జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి దేవరం వెంకటరెడ్డి, మండల కమిటీ సభ్యులు చందా చంద్రయ్య, ఎస్కె.సైదా, దేశిరెడ్డి స్టాలిన్‌రెడ్డి, సోంపంగు జానయ్య, ఆరె రామకృష్ణారెడ్డి, బచ్చలకూర స్వరాజ్యం, జూల కంటి కొండారెడ్డి,బోనాల మంగయ్య, రావులపెంట వెంకన్న, గడ్డం వినోద్, కిన్నర వెంకన్న, మండవ శేషు పాల్గొన్నారు.
హుజూర్‌నగర్‌టౌన్ : కార్మికవర్గానికి, రైతాంగానికి నష్టపరిచే చట్టాలకు వ్యతిరేకంగా మేడే స్ఫూర్తితో పోరాటానికి సమైక్యం కావాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీతల రోషపతి కోరారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆయన జెండాను ఎగురవేశారు.పట్టణంలోని సీఐటీయూ అనుబంధ సంఘాల రైస్ మిల్ కార్మికులు, మున్సిపల్,ఆటో, బిల్డింగ్,ఫ్లవర్స్ అసోసియేషన్,హమాలీలు,ఆల్ షాప్ గుమస్తాలు జెండాలు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు ఎలక సోమయ్యగౌడ్, గుండెబోయిన వెంకన్న, సాముల కోటమ్మ, మీసాల అంజి, చింతకాయల పర్వతాలు, కంకణాల రామయ్య, కోటాచారి, భేగం , మున్ని,రాజేష్, మహిపాల్, వీరమ్మ, బాలు, శీతల చందు, హనుమంతు పాల్గొన్నారు.
కోదాడరూరల్: పట్టణంలో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు ముత్యాలు, సీనియర్ నాయకులు జుట్టుకొండ బసవయ్య ఆధ్వర్యంలో హమాలీ ఆడ్డా వద్ద జెండా ఎగరవేసి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి యాతాకుల మధుబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వాస్పత్రిలో నిర్వహించిన మేడే వేడుకలకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు నిర్వహించారు.టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నయీమ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ చక్ర సెంట్రింగ్ వర్కర్స్ పండ్ల వ్యాపారస్తుల పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ మినీ లారీవర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు నాగేశ్వరరావు, గోపి, లక్ష్మీ, నర్సింహారావు, అంజి, చింత లింగయ్య, షేక్‌బాబా, షేక్‌సలీం, షేక్‌బషీర్, కందుల శ్రీను, ఆదామ్, రఫీ, వెంకటేశ్వర్లు, లింగమ్మ ,దానమ్మ, నాగరాజు, జానీ, షబ్బీర్ అలీ పాల్గొన్నారు.
గరిడేపల్లి : మండలంలోని పొనుగోడు,రాయినిగూడెం గ్రామాల్లో మేడే ఉత్సవాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్కె.యాకుబ్, రాచమల్ల రామస్వామి, దోసపాడు భిక్షం, రాచమల్ల పెద్దనర్సయ్య, దోసపాటి సుధాకర్, సైదులు, మచ్చ వెంకటేశ్వర్లు, పెండెం రాము, మట్టయ్య, అంజయ్య, జాన్, సైదా, గోపి, సోమయ్య, బత్తిని శ్రీను, వెంకన్న, నర్సయ్య, సైదులు పాల్గొన్నారు.
తుంగతుర్తి : మండలకేంద్రంతో పాటు,పలు గ్రామాల్లో సీఐటీయూతో పాటు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు నిర్వహించారు.దాని అనుబంధ సంఘమైన బిల్డింగ్ వర్కర్స్,హమాలీ, ట్రాక్టర్ డ్రైవర్ ఇతర సంఘాల ఆధ్వర్యంలో సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్, నాయకులు ఓరుగంటి అంతయ్య, రైతు సంఘం నాయకులు పల్లా సుదర్శన్, తాటి విజయమ్మ, గడ్డం ఎల్లయ్య, విష్ణుమూర్తి, దేవరాజ్ ముత్తయ్య, నగేష్, గణేష్, ప్రభాకర్,శివ,అబ్బాస్, భాస్కర్‌తో పాటు బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ హమాలీ ట్రాక్టర్స్ డ్రైవర్స్ రైస్ మిల్లర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు.
అదేవిధంగా కార్మికుల జీవితాల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన శుభదినం మేడే అని తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు గౌడిచర్ల సత్యనారాయణ అన్నారు.మండలకేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ చైర్మెన్ పులుసు యాదగిరి, వైస్‌ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలంయాదవ్, మాజీ ఎంపీపీ తాడికొండ సీతయ్య, గ్రంథాలయ చైర్మెన్ గోపగాని రమేశ్‌గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పులుసు వెంకటనారాయణ, గోపగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.
నేరేడుచర్ల : ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా పట్టణంలో సీపీఐ(ఎం), సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు.అనంతరం సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొదమగుండ్ల నగేశ్, సీఐటీయూ జిల్లా నాయకులు పారేపల్లి శేఖర్‌రావు, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ఆమనగంటి వీనయ్య, మండలనాయకులు నీలా రామ్మూర్తి, తిరుపతయ్య, సైదులు, ఏసు, సీపీఐ(ఎం) కౌన్సిలర్ సరిత పాల్గొన్నారు.
మండలకేంద్రంలో తెరాస కార్మిక విభాగం ఆధ్వర్యంలో మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతకుంట్ల సోమిరెడ్డి, హుజూర్నగర్ నియోజకవర్గ తెరాస కార్మిక విభాగం అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్ ఆధ్వర్యంలో నూతన పెయింటర్ యూనియన్ను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ లకుమళ్ళ జ్యోతి భిక్షం, జెడ్పీటీసీ రాపోలు నర్సయ్య, నేరేడుచర్ల మార్కెట్ కమిటీ చైర్మెన్ ఇంజమూరి యశోధరాములు,హుజూర్నగర్ మిల్లర్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు మల్లయ్య, తెరాస నాయకులు చిట్యాలవినోద్,ఉదరు, కత్తిఅనిల్, పోకల్‌కార్ వినోద్‌కుమార్,మాతంగి వెంకటేశ్వర్లు, కనకరాజుల రాంబాబు, రాపోలు మహేష్, కుర్రి వెంకన్న, నన్నెపంగగోపి పాల్గొన్నారు.
ప్రపంచానికి శ్రమ విలువలు తెలియజెప్పిన గొప్ప రోజు మేడే అని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు దూళిపాల ధనంజయనాయుడు అన్నారు.నేరేడుచర్ల ప్రధాన కూడలిలో మేడే సందర్భంగా ఎర్రజెండాను ఆయన ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మండలకార్యదర్శి రావుల సత్యం, సహాయ కార్యదర్శి ఎల్లబోయిన సింహాద్రి, కత్తి శ్రీనివాసరెడ్డి, మహిళా సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీ, ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు ఊదర వెంకన్న, ఏఐఎస్ఎఫ్ మండల కన్వీనర్ కొమర్రాజు వెంకట్, రైతు సంఘం మండల కార్యదర్శి కట్టెకోల వెంకన్న, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి గైగుళ్ళ శ్రీరాములు, దాసోజు వెంకటాచారి, చింతల శ్రీనివాస్, ,వంగాల రంజిత్‌రెడ్డి, రెడ్డిపల్లి వినరు, కత్తి వెంకటరెడ్డి, పాల్వాయి నాగయ్య,శ్రీనివాస్ పాల్గొన్నారు.
సూర్యాపేట: మానవాళి మనుగడకు దిక్సూచిగా ఎర్రజెండానే ఎల్లప్పుడూ నిలిచిఉంటుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, టూ టౌన్ కార్యదర్శి అన్నారు.మేడే ఉత్సవాల్లో భాగంగా పార్టీ టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌నగర్, సుందరయ్యనగర్లలో ఎర్రజెండాను ఎగురవేసి మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎం టూ టౌన్ కార్యదర్శి కోటగోపి,జిల్లా కమిటీ సభ్యులు వేల్పులవెంకన్న, జిల్లా నాయకులు పల్లేటి వెంకన్న, జీఎంపీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి వీరబోయిన రవి,డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కొండేటి ఉపేందర్, పార్టీ పట్టణ నాయకులు బత్తులవెంకన్న, కోట సజన, దొంతగానివెంకటేశ్వర్లుర, మొకర్ల వెంకన్న, నగిరి వెంకన్న, దాస్, ఆదిమల్ల ధనమ్మ, వంటెపాక పార్వతమ్మ, సైదమ్మ, వడిగలక్ష్మయ్య, అమతమ్మ, తిరుపతమ్మ, భారతమ్మ, కష్ణయ్య పాల్గొన్నారు.
మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన సీఐటీయూ జెండాను సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, మున్సిపల్ కార్మిక నాయకులు వీరస్వామి ఆవిష్కరించారు.పెయింటర్ వర్కర్స్, మార్బుల్ కార్మికులు, మార్కెట్ హమాలీలు,మిల్లు హమాలీలు,పార్బాయిల్డ్ హమాలీలు,ఆటో కార్మికులు, పొట్టు మిల్లు కార్మికులు, రైస్ మిల్లు హమాలీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో సీఐటీయూ జెండాను ఎగురవేశారు.మేడే సందర్భంగా సీఐటీయూ జెండాలు ఎగురవేసి చికాగో పోరాట మతవీరులకు జోహార్లర్పించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు మామిడి సుందరయ్య, మున్సిపల్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మధుసూదన్, చాగంటి వెంకటరమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ దశరథ, మురళీ, యాదయ్య, శివ, ఎల్లక్క, వెంకన్న, లింగయ్య, బాబు,వి సాయికుమార్, ఎల్గూరి గోవింద్, పెయింటర్ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మార్క్, మొండికత్తి లింగయ్య, లిల్లీ, నబీ, మల్లయ్య, హమాలీ కార్మికులు చంద్రయ్య, రమణ పాల్గొన్నారు.