Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అనంతగిరి
మండలపరిధిలోని శాంతినగర్‌లో అరుణపతాకాన్ని సీపీఐ మండల కార్యదర్శి, శాంతినగర్ సర్పంచ్ బద్ధం కృష్ణారెడ్డి ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి నాగభద్రం,మండలకోఆప్షన్ సభ్యులు లాల్‌సాహెబ్, నాయకులు పాల్గొన్నారు.
చింతలపాలెం : మండలవ్యాప్తంగా మేడే ఉత్సవాలు నిర్వహించి, జెండా ఆవిష్కరి ంచారు. మండలకేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో, సీఐటీయూ, సీపీఐ,ఏఐటీయూసీ, టిప్పర్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సభ్యులు వి.సైదులు, సీపీఐఎం మండల కార్యదర్శి కందుల సుందరమోలేశ్వరెడ్డి, గ్రామశాఖ కార్యదర్శి జంగాల పుల్లయ్య, హమాలీ సంఘం అధ్యక్షులు షేక్ మదర్, సత్యనారాయణ, మండల కమిటీ సభ్యులు మస్తాన్, పెద్ద రామయ్య, గోవిందరాజు, శ్రీను, తోడేటి శ్రీను, సీపీఐ మండల కార్యదర్శి చింతిరాల రవి, గ్రామశాఖ కార్యదర్శి దొంగల అంకరాజు, మాజీ సర్పంచ్ గోనె అంకయ్య, చిత్తలూరి వీరబాబు, సత్యం, భాష, సురేందర్, సైదులు, జువారి పరిశ్రమ యూనియన్ అధ్యక్షుడు రాజశేకర్ పాల్గొన్నారు.
నాగారం: మండలకేంద్రంలో వివిధ కార్మిక సంఘాలు ఎర్ర జెండా ఎగురవేసి మేడే ఉత్సవాలు నిర్వహించారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు నిర్వహించారు.సీఐటీయూ అనుబంధ సంఘాలు భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో నాగారం ఎక్స్‌రోడ్‌లో ఎర్రజెండా ఎగురవేసి మేడే ఉత్సవాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి బోర్డు శంకర్, వ్యవసాయ రైతు కూలీ సంఘం డివిజన్ అధ్యక్షుడు సంపెంట కాశయ్య, జాజుల సామేలు, భవన నిర్మాణ మండల కమిటీ అధ్యక్షుడు అనంతుల మల్లేష్, నాయకులు పేరబోయిన ఆవులయ్య, బి. లింగయ్య, దడిగ మల్లేష్, బయ్యా లింగయ్య, సోమయ్య, ఎల్లయ్య, చంద్రయ్య పాల్గొన్నారు.
సూర్యాపేట: 135 ఏండ్ల కింద చికాగో నగరంలో ఆరుగురు కార్మికుల రక్తంతో ఎగిరిన ఎర్రజెండానే నేటి శ్రామికుని స్వేచ్ఛాగీతమని న్యూడెమోక్రసీ ఎంఎల్ పార్టీ (చంద్రన్నవర్గం) జిల్లా నాయకులు కొత్తపల్లి శివకుమార్ వెల్లడించారు.శనివారం జిల్లాకేంద్రంలోని విక్రమ్ భవన్ ముందు మేడే జెండాను ఆయన ఎగురవేసిన అనంతరం మాట్లాడారు. కార్మికులు సాధించుకున్న 8 గంటల పని, 8 గంటలు ఆహ్లాదం, 8 గంటలు విశ్రాంతి అనే విధానాన్ని నేడు కేంద్ర ప్రభుత్వం 14 గంటలు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి కార్మికుల హక్కుల్ని కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్ని, చట్టాల్ని మార్చాలని కేంద్రం చూస్తుందని ఆరోపించారు.ఒక వైపు రైతు వ్యతిరేక చట్టాలతో రైతులను, మరోవైపు కార్మికులను మోసం చేయాలని చూడడం బీజేపీ ప్రభుత్వానికే చెల్లుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆరుట్ల శంకర్‌రెడ్డి,పీఓడబ్ల్యూ జిల్లా కన్వీనర్ కొత్తపల్లి రేణుక, మనమ్మా, శైలజ, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు జహంగీర్, జీవన్, రాము పాల్గొన్నారు.
మద్దిరాల: మండలంలోని వివిధ గ్రామాలలో, మండలకేంద్రంలో వివిధ కార్మికసంఘాల ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు నిర్వహించారు.సీపీఐఎం జిల్లా కమిటీ సభ్యులు కందాల శంకర్‌రెడ్డి, మండల కార్యదర్శి కల్లేపల్లి భాస్కర్ జెండాలను ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండలకమిటీ సభ్యులు చిదిరాల నారాయణ, తదితరులు పాల్గొన్నారు. రెడ్డిగూడెంలో భవన నిర్మాణ కార్మికులు నాగేల్లి రామనర్సయ్య,ఈర్జాల కిరణ్ భూర్గుల పాపయ్య,వెంకన్న,రమేశ్, నాగెల్లి వెంకన్న, యాకయ్య, వల్లపు వీరయ్య పాల్గొన్నారు.
మునగాల : మండలపరధిలోని నర్సింహులగూడెం,కక్కిరేణి గ్రామాల్లో మేడే వేడుకలు నిర్వహించారు.పార్టీ సీనియర్ నాయకులు పోటు పుల్లయ్య, బొబ్బని వెంకటేశ్వర్లు పార్టీ జెండాలను ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, సోమపంగు వీరబాబు, రావులపెంట వెంకన్న, బ్రహ్మం, ఈదయ్య, ఉపేందర్, సైదులు, జానిమియా, నర్సయ్య, వట్టెపు చిన సైదులు, హుస్సేన్ పాల్గొన్నారు.
సూర్యాపేటకలెక్టరేట్: సూర్యాపేట వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ఆవరణలో మేడే సందర్భంగా తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం , (హెచ్వన్) టీిఆర్ఎస్కేవీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు.ముఖ్యఅతిథులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ వై. వెంకటేశ్వర్లు(వై.వి), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ హాజరయ్యారు.ఈ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బూతరాజు సైదులు, యాతాకుల మధుబాబు జెండాను ఎగురవేశారు.తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం, (హెచ్.వన్) టీఆర్ఎస్కేవీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్ర మంలో డీఎంహెచ్ఓ కోటాచలం, డిప్యూటీ డీఎంహెచ్ఓ హర్షవర్థన్, ప్రోగ్రాం అధికారులు కల్యాణ్‌చక్రవర్తి, డాక్టర్ సాహితీ, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ శ్రీనివాసరాజు, యూనియన్ నాయకులు భాస్కరరాజు, యాదగిరి, రంగమ్మ, జ్యోతి, విజయ, నరేందర్‌రెడ్డి, షాబుద్దీన్, శేషయ్య, వెంకన్న, విజరుకుమార్ పాల్గొన్నారు.
అదేవిధంగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఐఎన్టీయూసీ పట్టణ అధ్యక్షులు వల్దాస్శ్రీను ఆధ్వర్యంలోజరిగిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు చెవిటివెంకన్నయాదవ్ జెండాను ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్‌అలీ, ఐఎన్టీయూసీ నాయకులు కొండపల్లి సాగర్‌రెడ్డి, బైరుశైలేందర్, కుమ్మరికుంట్ల వేణుగోపాల్, తండుశ్రీనివాస్యాదవ్, వెన్నమధుకర్రెడ్డి, ఆలేటి మాణిక్యం పాల్గొన్నారు.
సూర్యాపేటరూరల్: మండలంలోని రామచంద్రపురం గ్రామంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ మేడే జెండాను సీపీఐఎం సీనియర్ నాయకులు పొదిల అంజయ్య ఆవిష్క రించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చెరుకు సత్యం, మండల్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, నాయకులు జలగం సత్యం, చంద్రారెడ్డి, నర్రాఅంజయ్య, గీత కార్మిక నాయకుడు అనంతుల సురేష్, ఉప్పల యాదగిరిరెడ్డి, మాదాల వెంకన్న, లక్ష్మయ్య, మల్లేష్ పాల్గొన్నారు.అదేవిధంగా మండల పరిధిలోని రామారం గ్రామంలో హమాలీ సంఘం ఆధ్వ ర్యంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేశ్‌రెడ్డి జెండాను ఎగురవేశారు.ఈ కార్యక్ర మంలో ఐఎన్టీయూసీ నాయకులు చొక్కయ్య గౌడ్,హమాలీ సంఘం అధ్యక్షుడు సైదులు, ఉపాధ్యక్షుడు సైదులు,ఎల్లయ్య, వెంకన్న, కాంగ్రెస్ నాయ కులు పాలవరపు వేణు, స్వామినాయుడు,పోలగాని కష్ణ పాల్గొన్నారు.
మోతె:మండలకేంద్రంతో పాటు రాఘవపురం, సిరికొండ, బుర్కచర్ల గ్రామాల్లో సీపీఐ(ఎం), సీఐటీయూ ఆధ్వర్యంలో నామవరం గ్రామంలో సీసీఆర్ఐఎంఎల్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి జెండాలను ఎగురవేశారు.ఈ కార్యక్రమాల్లో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మట్టిపల్లి సైదులు, మండల కార్యదర్శి జి ఏసు, మండల కమిటీ సభ్యులు కంపాటి శ్రీనివాస్, కె.సత్యనారాయణ, కొండ రాములు, కె.పోతయ్య, కె.భాస్కర్, రేపాల వెంకన్న, భవన నిర్మాణ కార్మికులు చీరపంగు సైదులు, హమాలీ సంఘం అధ్యక్షులు దోసపాటి ఈదయ్య, చర్లపల్లి మల్లయ్య, దోసపాటి శ్రీనివాస్ , మరియమ్మ పాల్గొన్నారు.
నాంపల్లి: మండలకేంద్రంలో సీపీఐఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు నిర్వహించారు.ఆటో డ్రైవర్స్, వర్కర్స్ యూనియన్, రైస్ మిల్ల్ హమాలీ,సివిల్ సప్లరు హమాలీ సంఘాల వారు జెండాలు ఎగురవేశారు.ఈ కార్యక్రమాల్లో సీపీఐఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, రైతు సంఘం జిల్లా నాయకులు ముత్తిలింగం, సీఐటీయూ జిల్లా నాయకులు చెట్టిపల్లి నాగభూషణ్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కొమ్ము లక్ష్మయ్య, నాంపల్లి శంకర్, కాటం శంకర్,పూల శివ,జినకల యాదయ్య, కామిశెట్టి రాజు, పూల శ్రీను, నాంపల్లి కృష్ణయ్య పాల్గొన్నారు.
మర్రిగూడ : మండలంలోని మేటిచందాపురం, శివన్నగూడ, రాంరెడ్డిపల్లి, మర్రిగూడ, దామెరభీమనపల్లి గ్రామాలలో సీపీఐఎం, సీఐటీయూ జెండాలను ఎగురవేశారు.ఈ కార్యక్రమాల్లో సీఐటీయూ జిల్లా నాయకులు ఏర్పుల యాదయ్య,మైల సత్తయ్య, వట్టిపల్లి హనుమంతు, ఊరిపక్క లింగయ్య, పెరుమళ్ళ మంజుల, భీమనపల్లి ముత్తయ్య, బడే లక్ష్మీకాంత్, ఎడ్ల అంజయ్య, నక్కనర్సింహ, లఫంగి లింగయ్య, ఊరిపక్క బద్రి, పగిళ్ల రామచంద్రం, గిరి, విష్ణు పాల్గొన్నారు.
అదేవిధంగా మండలంలోని శివన్నగూడలో మేడే ఉత్సవాలు నిర్వహి ంచారు.సర్పంచ్ చిట్యాల సబితయాదగిరిరెడ్డి గ్రామపంచాయతీ కార్మికులకు శాలువా కప్పి సన్మానించారు.మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు ఏర్పుల యాదయ్య,లింగయ్య, వెంకటయ్య పాల్గొన్నారు
దామరచర్ల : మండలంలో సీపీఐఎం, సీఐటీయూల ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వినోద్ నాయక్,పాపానాయక్, దయా నంద్, సైదులు, ఖాజా మొయినుద్దీన్,గోపి సుబాని, రమేశ్ పాల్గొన్నారు.
నాగార్జునసాగర్ : మున్సిపాలిటీ పరిధిలోని పైలాన్‌కాలనీలో ఆటోవర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు.టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్నె బ్రహ్మనందరెడ్డి జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు బత్తుల సత్యనారాయణ, ఆటో కార్మిక నాయకులు ముడావత్ లక్ష్మణ్‌నాయక్, మసీద్రాము, రెడ్డి జేఏసీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కర్నె శరత్‌రెడ్డి, శేఖరాచారి, మన్సూర్, నజీర్, కొండల్, నాయకులు పాల్గొన్నారు.నందికొండ మున్సి పాలిటీపరిధిలోని హిల్‌కాలనీ ప్రభుత్వ దవాఖానలో ఏఐటీయూసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు నిర్వహించారు.అనంతరం దవా ఖానలో జెండాను ఎగురవేశారు.ఈ కార్యక్ర మంలో ఈ కార్యక్రమంలో నందికొండ మున్సి పల్ ఏఐటీయూసీ యూనియన్ అధ్యక్షులు కోటేశ్వర్రావు, పద్మావతి, లలిత, సుధా, రోషన్, రేణుకాదేవి, సైదమ్మ పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి : పట్టణంలో కార్మికులు మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మార్కెట్‌యార్డులో టీఆర్ఎస్కేవీ జెండాను ఆ సంఘం డివిజన్ అధ్యక్షుడు ఓడపల్లి యాదగిరి ఎగురవేశారు.ఈ కార్యక్ర మంలో కార్మికులు నర్సిరెడ్డి, కోటయ్య, బాలు, రామస్వామి, బోడబాలు, లచ్చయ్య, శంకర్ పాల్గొన్నారు.