Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి
నవతెలంగాణ-బీబీనగర్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండలకేంద్రంతోపాటు కొండమడుగు పారిశ్రామిక ప్రాంతంలోని వివిధ పరిశ్రమల ముందు 135వ మేడే వేడుకల సందర్భంగా సంఘటిత, అసంఘటితరంగ కార్మికులతో జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దేశంలో కరోనా రెండో దశ విజంభిస్తుందన్నారు. కరోనా కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కరోనా బారిన పడ్డ కార్మికునికి 14 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ బండారు శ్రీరాములు, నాయకులు ఎరుకలి బిక్షపతి, గాడి శ్రీనివాస్, కందాడి దేవేందర్‌రెడ్డి, టంటం వెంకటేశం, రేసు రామచంద్రారెడ్డి, బండారు శ్రావణ్, జంగయ్య, రమేశ్‌నాయక్, వంటల బస్వయ్య, మునీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం ఈశ్వర్, పొట్ట యాదమ్మ, బండ యాదగిరి, చీర నాగేశ్, నోముల బస్వారెడ్డి, దాసరి ముత్యాలు, బాలమణి, తాళ్ల శ్రీనివాస్, పంజాల మహేశ్, తూపెల్లి బాల్‌రెడ్డి, తూపెల్లి నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సీపీఐ(ఎం) మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో వివిధ వార్డుల్లో మేడే ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్చైర్మెన్్ బత్తుల శ్రీశైలం పార్టీ జెండావిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్, నాయకులు బండారు నర్సింహా, దండ అరుణ్‌కుమార్, గోశిక స్వామి, కరుణాకర్, బత్తుల దాసు, ఎమ్‌డి.ఖయ్యుమ్, గుణమోని అయిలయ్య, రాములు పాల్గొన్నారు.
కార్మికుల హక్కుల కోసం ఐఎన్టీయూసీ నిరంతరంగా పోరాటం చేస్తుందని ఆ సంఘం డివిజన్ అధ్యక్షులు లగ్గోని వెంకటేశంగౌడ్ అన్నారు. శనివారం మున్సిపల్ కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మేడే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఐఎన్టీయుసీ జెండావిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం పోరాడిన రోజుగా గుర్తించి శ్రామిక శక్తిగా గుర్తుగా జరుపుకోవడం 1886 నుండి మేడే ప్రారంభమైందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చామకూర రాజయ్య, మాదగోని గాలయ్య, గట్టు వెంకటేశం, కొండ కష్ణ, ఎమ్‌డి.ఇమ్రాన్, రహమత్, కందగట్ల చరణ్, అల్వాల్ శ్రీనివాస్, మల్లేశ్, అర్జున్, నర్సింహా, యాసిన్, యాదగిరి, లింగస్వామి, రాజు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయం ఆవరణలో ఆ పార్టీ సీనియర్ నాయకులు మొరిగాడి చంద్రశేఖర్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి ఎండి.ఎక్బాల్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఎలుగల బాలయ్య, మంగ అరవింద్, బొప్పిడి యాదగిరి ,మొరిగాడి లక్ష్మణ్ ,చెన్నై రాజేష్, భువనగిరి గణేష్, ఎలుగల శివ, మొరిగాడి అశోక్, మొరిగాడి అజరు, కటకం సుదర్శన్ ,చెక్క పరుశరాములు, పాల్గొన్నారు.
సీపీఐ, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో జెండాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్ జనార్దన్ ,ఆయిల్ సత్తయ్య బెజడి కుమార్, ఇక్కిరి సహదేవ్ ,కళ్లెం అడవయ్య, చక్కా వెంకటేష్, గొటి పాములా రాజు, కనకయ్య ,మాటూరు జానమ్మ, తెడ్డు ఆంజనేయులు, బొడ్డు ఆంజనేయులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోమొరిగాడి మైసయ్య స్తూపం ఆవరణలో జెండాను సీపీఐఎంఎల్ జిల్లాకార్యదర్శి బొమ్మకంటి రాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు తాటికాయలా సూర్యం, గిర్రాజు అంజయ్య, మల్లేష్, నర్సింహ , తదితరులు పాల్గొన్నారు. తాపీ బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు చిమ్మీ సిద్ధులు, గౌరవాధ్యక్షులు హరీశ్ శ్రీను సలహా దారులు కుడికాల దామోదర్ గుజ్జ భిక్షపతి సహాయ కార్యదర్శి నమిలే శ్రీను, కోశాధికారి పల్లె నర్సింహులు, ఉపాధ్యక్షులు జి సిద్ధులు , తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలీ కార్మిక సంఘం వద్ద ఆ సంఘం మండల కార్యదర్శి మంగ అరవింద్ జెండా ఆవిష్కరించార.ు ఈ కార్యక్రమంలో నాయకులు చెన్నై రాజేష్ ,నరేష్ , హమాలీ కార్మికులు పాల్గొన్నారు.
విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో
మండల కేంద్రంలో విద్యుత్ సబ్ డివిజన్ ఆవరణలో టీఈఈ 1104 ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సంఘం నాయకులు జి యాదగిరి, రమేష్, ఆంజనేయులు, ఉప్పలయ్య, జానకిరాము, నాగరాజు , కార్మిక సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .
కార్మిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వలు కషి చేయాలి
కార్మిక కర్షక సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కషి చేయాలని ఆలేరు మాజీ శాసనసభ్యులు బూడిద భిక్షమయ్య గౌడ్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక, కర్షకులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు.
రాజాపేట : మండలంలో బేగంపేట గ్రామంలో శనివారం మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీపీఐ మండల కార్యదర్శి చిగుర్ల లింగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మూల పోచయ్య, బొద్దుల ఆది నారాయణ, గ్రామ శాఖ అధ్యక్షుడు ఒగ్గు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.