Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మగౌరవ పతాకను ఎగురవేయాలి
- తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్
నవతెలంగాణ-నల్లగొండ
టీఆర్ఎస్కు మంత్రి ఈటెల రాజేందర్ స్వస్తి పలకాలని తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షులు డాక్టర్చెరుకు సుధాకర్ అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలో ని విశ్వబ్రాహ్మణ భవనంలో బీసీ సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఎంతోమంది టీఆర్ఎస్ నేతలు, మంత్రులు తమ భూములు గుంజుకుంటున్నారని పేద మధ్యతరగతి ప్రజలు గగ్గోలు పెడితే కూడా సీఎం కేసీఆర్ విచారణ జరిపించలేదన్నారు. కాని హకీంపేట, మాసాయిపేట, అచ్చంపేట రైతులు స్వయంగా మీడియా ముందుకు వచ్చి తాము రాజేందర్ కు అమ్ముకున్నం చెపుతుంటే కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తున్న మీడియా మాత్రం రాజేందర్‌ను అవమానపరుస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే మంత్రి పదవి తొలగించి ఘోరంగా అవమాన పరిచారన్నారు. రాష్ట్రంలో కరోనా తో ప్రజలు కకాలావికలం అవుతుంటే కరోనా రోగి ఈటెల మంత్రి పదవిని గుంజుకున్నడన్నారు. వందల ఎకరాలు కబ్జా పెట్టిన మంత్రి మల్లారెడ్డి పైన కబ్జా కేసు ఐతే ఎందుకు విచారణ జరిపించలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు పందుల సైదులు కాసోజు విశ్వనాథం శంకర్ ముదిరాజ్ నకరికంటి కాశయ్య గౌడ్ రామకష్ణ ముదిరాజ్ కొండేటి మురళి యాదయ్య యాదయ్య రమేష్ రాజా గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.