Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొండమల్లేపల్లి
విద్యుదాఘాతంతో వ్యక్తి మతి చెందిన సంఘటన శనివారం కొండమల్లేపల్లి మండలపరిధిలోని గుమ్మడవెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పంగ నర్సింహ(33) తన ట్రాక్టర్ను తీసుకుని గ్రామానికి చెందిన ఓ రైతు పొలం వద్ద ఉన్న వరిధాన్యం తీసుకొచ్చేందుకు శనివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఇంటి నుంచి వెళ్లాడు.గ్రామంలోని వీధిగుండా వెళ్తుండగా ఓ ఇంటి సమీపాన విద్యుత్ స్తంభం నుండి ఇండ్లకు ఏర్పాటుచేసిన సర్వీస్ వైర్ కిందకు జారి ఉండడంతో ట్రాక్టర్కు తగిలి విద్యుద్ఘాతమై నర్సింహ మృతి చెందాడు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించారు.మృతుని తండ్రి చంద్రయ్య పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.మృతునికి భార్య రేణుక, మూడేండ్ల పాప, నెలరోజుల పాప ఉన్నారు.