Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
కరోనా వైరస్ పట్ల సర్పంచులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పి .రాధ పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని గోపాలయపల్లి గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ భాస్కర్ రావు బహూకరించిన ఆక్సిజన్ పల్సే మీటర్‌ను ఆశా కార్యకర్తలు అందజేశారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెకండ్ వే కరోనా వైరస్ చాలా తీవ్రంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందన్నారు. ఎవరు కూడా ఆక్సిజన్ అందకుండా మరణం సంభ వించవద్దని, గ్రామాల సర్పంచులు గ్రామ పంచాయతీ నిధుల ద్వారా గ్రామంలో ఆక్సిజన్ పల్స్ మీటర్‌ను కొనుగోలు చేసి అందుబాటులో ఉంచాలని సూచించారు. గ్రామంలో ఎవరికైనా శ్వాస తీసుకోవడం ఇబ్బందిఉంటే చెక్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు .ఈ కార్యక్రమం లో సర్పంచ్ గోసుల భద్రాచలం కార్యదర్శి ఆంజనేయులు వార్డ్ మెంబెర్ కేతరపు గోవర్ధన్, తిరుగుడు పరమేష్ గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు .