Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ తనదైన శైలిలో మరోసారి మానవత్వం చాటుకున్నారు.పట్టణంలోని స్థానిక 9వ వార్డులో సోమవారం ఇటీవలే కరోనా సోకిన పలు కుటుంబాలకు ఇంతకు ముందులాగే మరోసారి నిత్యావసర సరుకులు, బియ్యం,పండ్లు, కూరగాయలు వారికి అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా సోకిన కుటుంబాలకు ఆదుకునేందుకు తాను చేస్తున్న ప్రయత్నమని అన్నారు.కరోనా బారిన కుటుంబాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.అనంతరం స్థానిక 9వ వార్డులో ఆమె సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశానుసారం సోడియం హైపోక్లారైడ్ ద్రావణం పిచికారీ చేయిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, వార్డు ఇన్చార్జి ఖమ్రుదీదన్ పాల్గొన్నారు.