Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పట్టణంలో వివిధ శాఖల అధికారులు సామాజికదూరం, కోవిడ్‌నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానా విధిస్తున్న విషయం విధితమే.ఇది జిల్లాలో కొంతైనా నివారించే ప్రయత్నం చేసినప్పటికీ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొన్ని స్కానింగ్ సెంటర్‌తో పాటు ఇతర స్కానింగ్ సెంటర్లలో సామాజికదూరం పాటించడం లేదు.స్కానింగ్ చేయించుకోవడానికి ఒక్కో సెంటర్‌కు ప్రతిరోజూ సుమారు 100 మందికి పైగా జనాలు వస్తుంటారు.కానీ సెంటర్ నిర్వాహకులు ఎలాంటి నిబంధనలు పాటించకుండా, వచ్చిన వ్యక్తులు కోవిడ్ నిబంధనల ఏ మేరకు పాటిస్తున్నారు.? అనే విషయాన్ని పట్టించుకోకుండా, ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొన్నట్టు కన్పిస్తోంది.జనాలను ఒక (వెయిటింగ్‌హాల్) దగ్గర ఉంచి, ఒక్కరికి స్కానింగ్ నిర్వహిస్తున్నారు.దీనిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులపై నిఘా ఏర్పాటు చేసి, స్కానింగ్ సెంటర్లలో సోషల్ డిస్టెన్స్, నిబంధనలు పాటించని సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పట్టణప్రజలు కోరుతున్నారు.