Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
ప్రతిఇంటికీ మిషన్ భగీరథ నీరందించాలని ఎంపీపీ కవితరాములుగౌడ్ అన్నారు.సమవారం ఎంపీడీఓ కార్యాలయంలో మిషన్ భగీరథ నీళ్లపై అత్యవసర సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ముఖ్యంగా మిషన్ భగీరథ నీళ్లు ప్రతి గ్రామ పంచాయతీకి,ఆవాసాలకు అందించాలని,వేసవి కాలంలో మంచినీటి సమస్య రానివ్వొద్దన్నారు.ఎక్కడైనా సమస్య వస్తే సకాలంలో స్పందించాలని కోరారు.,ప్రతి గ్రామ పంచాయతీకి మిషన్ భగీరథ నీటికి సంభందించి సమయ పట్టిక కేటాయించి ఆ షెడ్యూల్ ప్రకారం మంచినీటి సరఫరా చేయాలని కోరారు. ప్రభుత్వం మిషన్ భగీరథపథకంలో ప్రతి ఇంటికి తాగునీటి సమస్య తలెత్తకుండా నల్లాలు ఏర్పాటుచేసి ప్రజలకు నిర్వహిం చాలన్నారు.ముఖ్యంగా లీకేజీలపై ప్రత్యేక దష్టి సారించి మరమ్మతు చేయాలన్నారు. గ్రామాల్లో కొన్ని కాలనీలలో ప్రజలు తమకు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని వాటిని వెంటనే స్వీకరించి నీరు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వేసవిలో మంచినీటి సమస్య రాకుండా మిషన్ భగీరథ పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేసి ప్రతి ఇంటికి నీరందించాలన్నారు.ఈ సమావేశంలో ఎంపీడీఓ ఎల్.లక్ష్మీ,ఎంపీఓ భీంసింగ్నాయక్, డిప్యూటీ తహసీల్దార్ ఎస్.పుష్ప, మిషన్‌భగీరథ ఇంట్రాలైన్ డీఈ వి.శ్రీకాంత్, గ్రిడ్ ఈఈ అశోక్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నల్లు రామచంద్రారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.