Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాస్కులు పంపిణీ చేసిన జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ-భువనగిరి
చారిత్రకంగా 48 ఏండ్ల్ల తర్వాత మరొకసారి రెండోసారి అధికారం చేపట్టి చరిత్ర సష్టించిన కేరళలో వామపక్షకూటమి విజయం పట్ల సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా శ్రేణులు సోమవారం సేవాకార్యక్రమం ద్వారా విజయోత్సవం నిర్వహించారు.సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి. ఎండి.జహంగీర్ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం వద్ద మాస్కులు పంపిణీచేశారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ కేరళలో వామపక్ష ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం చాలా గొప్ప పరిణామం అన్నారు.అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో ఈ గెలుపు సునాయాసమైందన్నారు. కేరళలో ఒకసారి అధికారాన్ని పొందిన ప్రభుత్వం రెండోసారి అధికారాన్ని పొందలేక పోయిందన్నారు. 48ఏండ్ల తర్వాత విజయన్ నేతత్వంలో ముందుకు సాగిన సీపీఐ(ఎం) వామపక్ష ప్రభుత్వం గత చరిత్రను తిరగరాసి రెండోసారి అధికారం పొందిందన్నారు. ఆ రాష్ట్రంలో నిషా తుఫాన్‌తో పెద్దఎత్తున వరదలు వచ్చి అక్కడున్న ప్రజా జీవనమంతా అస్తవ్యస్తమైన సందర్భంలో సీపీఐ(ఎం) ప్రజలందరికీ అండగా నిలబడిందన్నారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం అధికారంలో లేకుండా చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్రలు కుతంత్రాలు చేసిందన్నారు. ముఖ్యమంత్రిపై అనేక తప్పుడు ప్రచారం చేశారన్నారు. కానీ అక్కడి విజ్ఞులైన ప్రజలు బీజేపీకే పాచికలు చెల్లనీయమని ఉన్న ఒక్క సీటు కూడా లేకుండా చేశారని తెలిపారు. కరోనా నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు సరైన వైద్యం అందించిందన్నారు .కేరళలో విజయన్ ప్రభుత్వం కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొందన్నారు. నేడు దేశమంతా తనవైపు చూసే విధంగా కేరళలో ప్రజా పాలన అందిస్తున్నారని గుర్తు చేశారు. కమ్యూనిస్టు పాలన ద్వారానే ప్రజలకు తగిన న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు దాసరి పాండు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాయ కష్ణ, సిర్పంగి స్వామి పాల్గొన్నారు.