Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగింది. ఉదయం 7 గంటల నుండి8 గంటల వరకూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఒక వార్డులో ఉన్న రెండు పోలింగ్ కేంద్రాలలో మొదటి కేంద్రం పెట్టను తీసుకొచ్చి ఏజెంట్ల సమక్షంలో తెరచి అందులోని పత్రాలను ఇరవై ఐదు చొప్పున కట్టలు కట్టి పక్కన పెట్టారు సంబంధించిన రెండవ బ్యాలెట్ ఓట్లను ఇదేవిధంగా కట్టలుగా చేసి కలిపి అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు. మొదటి రౌండ్లో ఒకటో నెంబర్ హాల్లో 1,2, 4,5 వార్డులు రెండవ నెంబర్ హాల్లో 13, 15, 17 ,19 వార్డులు, మూడవ నెంబర్ హాల్లో 7, 8 ,10 ,11 వార్డులు, రెండవ రౌండు ఒకటో నెంబర్ హాల్లో 3,5 వార్డులు, రెండవ నెంబర్ హాల్లో 14 ,16, 18, 20 వార్డులు, మూడవ నెంబర్ హాల్లో 9, 12 వార్డుల ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటించారు.
ఆరో వార్డులో రీకౌంటింగ్
పట్టణంలోని ఆరో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి మంగినపల్లి ధనమ్మ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి మంటిపల్లి కవిత మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఫలితాలు లెక్కింపు సందర్భంగా కొంత ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ఆవరణంలో ధనమ్మ గెలిచిందని ప్రచారం కూడా జరిగింది. రీకౌంటింగ్ చేయడంవల్ల మంటి పల్లి కవిత 21 ఓట్ల మెజార్టీతో ధనమ్మ పై గెలుపొందింది.
పట్టణంలో 144 సెక్షన్ అమలు
నకిరేకల్ మున్సిపల్ ఓట్ల లెక్కింపు ఉన్నందున నకరేకల్ పట్టణంలో సోమవారం 144 సెక్షన్ అమలు చేశారు. పట్టణంలోని మూసీ రోడ్డు మెయిన్ రోడ్డు తిరుపతి రోడ్డులో ఉన్న దుకాణాలను బంద్ చేయించారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు .డీఎస్పీి వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహించారు. ఫలితాల సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.