Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్‌పహాడ్
మండలకేంద్రంలోని శ్రీసత్యగార్డెన్ ఫంక్షన్హాల్లో సోమవారం ఎంపీపీ నెమ్మాది భిక్షం అధ్యక్షతన మిషన్ భగీరథ పథకంపై సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎంపీపీ భిక్షం, జెడ్పీటీసీ మామిడి అనిత అంజయ్య మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ పనులు ఎంత వరకు వచ్చాయి, గ్రామలలో ఎన్ని గహాలకు ఎన్ని ఇండ్లకు నీళ్లను అందుతున్నాయనే అంశాలపై సమీక్ష చేశామన్నారు.ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు అందరికీ చేరేలా గ్రామాల్లోని సర్పంచులు, ఎంపీటీసీలు పనిచేయాలన్నారు. వివిధ గ్రామాలలోని సర్పంచులు మాట్లాడుతూ గ్రామంలో మిషన్ భగీరథ ట్యాంక్ నిర్మించా మన్నారు.గ్రామంలోని ప్రతి ఇంటికి నల్లా కలెక్షన్ లేనందున నీళ్లు సరఫరా కావడం లేదన్నారు.అంతేకాక గ్రామ పంచాయతీ నిధులు సరిపోవడం లేదని, ఆ నిధులు కేవలం గ్రామ పంచాయతీ యొక్క ట్రాక్టర్ డీజిల్‌కు, సిబ్బందికి వేతనాలు, స్ట్రీట్‌లైట్స్, విద్యుత్ బిల్లులు నెలకు రూ.60 వేల నుండి రూ.40 వేల ఇస్తున్నట్టు తెలిపారు.అభివద్ధి పనులు చేయాలంటే గ్రామ పంచాయతీలో నిధులు ఉండాలన్నారు.విషయాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డికి తెలియజేసి ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు మంజూరు చేసినట్టయితే గ్రామంలో అనేక అభివద్ధి కార్యక్రమాలు చేపడతామని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ తెలిపారన్నారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ బాణాల శ్రీనివాస్, తహసీల్దార్ శేషగిరిరావు, మిషన్ భగీరథ ఏఈలు శ్రీనివాస్, జనార్దన్, సింగిల్ విండో చైర్మెన్ నాదాల జానకిరాంరెడ్డి పాల్గొన్నారు.