Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
ఈటెల రాజేందర్‌ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయడాన్ని నిరసిస్తూ ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో సోమవారం మున్సిపాల్ కేంద్రంలో నేతాజీ భువనగిరి చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నేత ఈటెల రాజేందర్‌ను సీఎం కేసీఆర్ తన రాజకీయ స్వార్థం కోసం కుట్రప్నఇ్న మంత్రి పదవి నుంచి తొలగించాడన్నారు. అగ్రవర్ణ ఎమ్మెల్యేలు మంత్రుల పై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా పట్టించుకోని కేసీఆర్ బిసి ముద్దు బిడ్డ ఎదుగుదలను చూసి ఓర్వలేక అవాస్తవాలు ప్రచారం చేసి అవమానించారన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి కరోనా సమయంలో వందలాది మంది రోడ్లపై రాస్తారోకోలు చేయడం సరైనది కాదని వారికి నచ్చజెప్పారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బసవయ్య, భాస్కర్ ,యాదగిరి ,లక్ష్మణ్, వేముల రాజు ,శ్రీరాములు, సీతయ్య, భాష, శ్రీను, శ్రీనివాస్, శ్రీశైలం ,గణేష,్ రమేష్, జనార్దన్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల : బడుగు ,బలహీన వర్గాలకు ఆశాజ్యోతి ఈటెల రాజేందర్ మంత్రి పదవి నుండి తొలగించడాన్ని నిరసిస్తూ సోమవారం పెద్దకాపర్తి గ్రామంలో పెద్దమ్మ తల్లి యూవజన సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పారబోయిన స్వామి, యూవజన సంఘం అధ్యక్షుడు మోర రామరాజు, ఉపాధ్యక్షుడు గుండబోయిన మహేష్, కోశాధికారి నూతి తిర్మలేష్ , సభ్యులు నరేష్, విజరు, గణేష్ స్వామి, మల్లేష్ , చంద్రం, మత్స్యగిరి , వెంకటేష్ , రాజు ,యాదగిరి, నరసింహ, నరేష్, సురేష్ ,ప్రశాంత్ వేణు, హరీష్ ,చందు, తదితరులు పాల్గొన్నారు.