Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహద్భావంతో, సేవానిరతితో సమాజ సేవలో మమేకం
- మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో ప్రారంభమైన టిఫిన్, భోజన వితరణ కార్యక్రమం
- 15 రోజుల పాటు రోగులకు, అటెండెంట్స్ కు అందనున్న విశిష్ట సేవలు
నవతెలంగాణ -మిర్యాలగూడ
పట్టణానికి చెందిన ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, ఆర్ఎస్ లిటిల్ ఛాంప్స్ క్లబ్ వ్యవస్థాపకులు రంగా శ్రీధర్ తన మిత్రబృందంతో మరో సామాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.కరోనా మహమ్మారి విజంభణతో లక్షలాది కుటుంబాలు ఉపాధిఅవకాశాలను కోల్పోయి ఆర్ధిక, మానసిక ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇలాంటి తరుణంలో పలువురు నిరుపేదలకు సాయమందించేందుకు రంగా శ్రీధర్ టెన్త్ క్లాస్ మిత్రబృందం డాక్టర్ రేపాల కవిత, జ్యోతిరెడ్డి, అజరుకుమార్,ముత్యాల సత్యనారాయణ, చిట్టిప్రోల్ మురళి సహృద్భావంతో, సేవానిరతితో సమాజసేవలో మమేకమయ్యేందుకు ముందుకొచ్చారు. వీరంతా మిర్యాలగూడ పట్టణంలోని ప్రగతి హైస్కూల్లో కలిసి చదువుకొని వివిధ హోదాల్లో స్ధిరపడ్డారు.నిరుపేదలకు, కోవిడ్ లాంటి సంక్షోభకర పరిస్థితుల్లో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న పేషంట్లకు, అటెండెంట్లకు టిఫిన్, భోజనం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో వాసంతి ఆస్పత్రికి సమీపంలో 100 మందికి టిఫిన్, 250 మందికి మధ్యాహ్న భోజన వితరణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ మార్గదర్శనంలో ఈనెల3న ప్రారంభమైన ఈ సేవలు ఈనెల17 వరకు కొనసాగనున్నాయి. వివిధ వైద్య సేవల కోసం డాక్టర్స్ కాలనీకి వచ్చేవారికి తమవంతుగా సాయం అందించాలనే మానవతా దక్పథంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు రంగా శ్రీధర్ మిత్ర బందం తెలిపారు.కోవిడ్ విసిరిన పంజాతో అతలాకుతలమైన కుటుంబాలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.