Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలంగాణ ప్రజాపోరు సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జిల్లా రవి అన్నారు.సోమవారం స్థానికంగా అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నెబర్లు 130/5,130/9,130/10, 64/6 భూములను రెగ్యులర్ చేయమని రిటైర్డ్ కలెక్టర్ ధర్మారెడ్డిని ఈటల రాజేందర్ కోరారన్నారు.ఈ విషయంపై దుర్మార్గపు ప్రచారాలు చేస్తున్నవ్యక్తులపై న్యాయ విచారణ జరిపించి వారు 2004 నుంచి అఫిడవిట్లో చూపించిన ఆధారాల ప్రకారం, 2018 ముందస్తు ఎన్నికలకు అఫిడవిట్లో చూపించిన ఆస్తుల వివరాలను పూర్తిస్థాయిలో న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.బీసీల ఆత్మగౌరవం, ముదిరాజ్‌ల ముద్దుబిడ్డ ఈటల రాజేందర్‌ను పొమ్మనలేక పొగ పెట్టి మంత్రివర్గం నుంచి తప్పించారన్నారు.అదే విధంగా గ్రామాల్లో ప్రజల భూములను రూ.2 లక్షలకు భూములను విక్రయించామని గ్రామప్రజలు చెప్పారన్నారు.నలుగురు టీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం ఆదేశాలతో కుమ్మక్కై భూములు కబ్జాలు చేసుకున్నారని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఏది ఏమైనా అసైన్మెంట్ భూములకు 1977లో చట్టానికి సవరణ చేస్తూ 2007 వరకూ పాతచట్టాన్ని అమలు చేయడం జరిగిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం 2007 నుంచి డిసెంబర్ 31 2017 వరకు తాజా చట్టాన్ని అమలు చేయడం జరిగిందని, చట్టానికి సవరణ అందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు, బలహీన వర్గాలు, సన్న, చిన్నకారు రైతుల భూములను రెగ్యులర్ చేస్తున్నట్టు అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ చట్ట సవరణ చేస్తున్నట్టు బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అన్ని విధాలుగా ప్రజలకు భూములను అమ్ముకునే విధంగా తెలంగాణ ప్రభుత్వమే అవకాశాన్నికల్పించిందని, అప్పుడు ఆ భూములను కొనుగోలు చేసుకోవడంలో తప్పులేదన్నారు. ప్రభుత్వాలే చట్ట సవరణలు చేయడం తర్వాత చేతులెత్తడం జరుగుతుందన్నారు.ఎమ్మెల్యే, ఎంపీలు క్యాబినెట్లోనున్న మంత్రులు, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్‌రావుల భూముల విషయాలలో ఆస్తిపాస్తుల విషయాలలో వారు పోటీ చేసినప్పటి నుండి అఫిడవిట్లో ఆస్తుల వివరాలు మొత్తం పూర్తిస్థాయిలో సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఒక నిప్పులాంటి నిజాన్ని కప్పిపుచ్చుకోవడం చాలా బాధాకరమని, 2001 సంవత్సరం నుండి టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి అనేకమైన ఉద్యమాలు చేపట్టి కష్టపడి ప్రజలలో గుర్తింపు తెచ్చుకున్నవ్యక్తి ఈటల అన్నారు.