Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
కరోనా రెండవదశ అత్యంత ప్రమాదకారిగా మారుతున్న తరుణంలో ప్రజలను రవాణా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ కార్మికులకు తార్నాకలో ప్రత్యేక కరోనావార్డు ఏర్పాటు చేయాలని టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్.రాంబాబు సోమవారం కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఎస్డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు డిమాండ్ బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వర్తించారన్నారు. ప్రభుత్వం యాజమాన్యాలు తగినన్ని జాగ్రత్తలు తీసుకోని కారణంగా కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.కరోనాతో మరణించిన ఆర్టీసీ ఉద్యోగులకు కార్మికులకు 50 లక్షల రూపాయల ప్రత్యేక భీమా వర్తింపజేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సోమయ్య, ఏఎస్.రావు, ఉపేందర్‌రావు, డ్రైవర్లు పాల్గొన్నారు.