Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
- నివాళులర్పించిన శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి
నవతెలంగాణ -చిట్యాల
సీపీఐ(ఎం)సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవ రెడ్డి కుమారుడు నర్రా క్రిష్ణా రెడ్డి మరణం పట్ల తీరని లోటని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో కృష్ణారెడ్డి ఆదివారం అనారోగ్యంతో మృతిచెందాడు. క్రిష్ణా రెడ్డి భౌతికకాయాన్ని సోమవారం చెరుపల్లి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహ రెడ్డి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి సందర్శించి నివాళులర్పించారు. అదేవిధంగా శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర విద్యుత్‌శాఖా మంత్రి జగదీశ్‌రెడ్డి , మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం,ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి కృష్ణారెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ నర్రా రాఘవ రెడ్డి తనయుడిగా క్రిష్ణా రెడ్డి కడ వరకు కష్టజీవుల పార్టీ కమ్యూనిస్టు కార్యకర్తగా కొనసాగారని అన్నారు. రైతుగా రైతుల, కూలీల పక్షాన నికరంగా పోరాడిన క్రిష్ణా రెడ్డి అకాల మరణం వట్టిమర్తి సీపీఐ(ఎం) గ్రామశాఖకు తీరని లోటన్నారు. క్రిష్ణా రెడ్డికి ముగ్గురు కుమారులు, భార్య ఉన్నట్లు తెలిపారు. ఈ అంత్యక్రియల్లో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, పాలడుగు నాగార్జున, బండ శ్రీ శైలం, జిల్లా నాయకులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, పామనుగుల్ల అచ్చాలు, పుచ్చకాయల నర్సిరెడ్డి, ఎండి.సలీమ్, సయ్యద్ హశం, దండెంపల్లి సత్తయ్య, మండల నాయకులు రాచకొండ శ్యామ్ సుందర్, బూరుగు క్రిష్ణ వేణి, నర్రా బిక్షం రెడ్డి, బూరుగు శీను తదితరులు పాల్గొన్నారు.