Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ - భువనగిరి
బీబీనగర్ ఏయిమ్స్ ఆస్పత్రిలో కరోనా ఇన్ఫెక్షన్ విభాగాన్ని 500 పడకలతో వెంటనే ప్రారంభించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ కోరారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ సీపీఐ(ఎం) జిల్లా కమిటీ పిలుపులో భాగంగా సోమవారం పట్టణకేంద్రంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ కుటుంబంతో కలిసి ఇంటివద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికీ రూ. 7500 ఇవ్వాలని, రేషన్ షాపుల ద్వారా 17 రకాల నిత్యావసర వస్తువులు అందించాలని డిమాండ్ చేశారు. కరోనా వ్యాక్సిన్లు ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వాలని కోరారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బట్టుపల్లి అనురాధ ఆమె కుమారుడు బట్టుపల్లి నవీన్‌తో కలిసి ఆమె ఇంటి వద్ద నిరసన తెలిపారు.