Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు
- మున్సిపాలిటీలోనే 217 పాజిటివ్ కేసులు
నవతెలంగాణ-మోత్కూర్
మండలంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మండలంలో సోమవారం ఇద్దరు వ్యక్తులు కరోనాతో మతి చెందారు. మున్సిపల్ కేంద్రానికి చెందిన వ్యక్తి(48) కరోనాతో వారం రోజులుగా హోం ఐసోలేషన్లో ఉన్నాడు.ి సోమవారం శ్వాస ఆడక పోవడంతో పరిస్థితి విషమించగా చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మతి చెందాడు. మతుని భార్యకు కూడా పాజిటివ్ కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. మతునికి ఇద్దరు కుమారులు కాగా ఓ కుమారుడు అనారోగ్యంతో మతిచెందగా, ఇప్పుడు తండ్రి మతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. మండలంలోని ముశిపట్ల గ్రామానికి చెందిన మరో వ్యక్తి (70)కరోనా తో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మతి చెందాడు. మతదేహాలకు ఆయా గ్రామాల్లో కోవిడ్ నిబంధనలతో అంత్యక్రియలు పూర్తి చేసినట్టు పీహెచ్ సీ డాక్టర్ ఆకవరం చైతన్య కుమార్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం 73 మందికి కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా 26 మందికి పాజిటివ్ వచ్చింది. మోత్కూర్ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 217 మంది, మండలంలోని గ్రామాల్లో 64 మంది కరోనా భారిన పడి హోంఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారు.