Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నల్లగొండ
కరోనాతో బాధ పడుతున్న వారు ప్రయివేటు ఆస్పత్రికి కాకుండా ప్రభుత్వాస్పత్రుల్లోనే చికిత్స పొందాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కోరారు. శనివారం ఆయన స్థానిక ప్రభుత్వాస్పత్రిలోని కోవిడ్ వార్డులను పరిశీలించారు. వార్డుల్లో తిరిగి కరోనా బాధితులతో మాట్లాడారు. వారికి అందించే చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. కరోనా పేషెంట్లకు అందుతున్న వైద్యం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని వసతులూ ఉన్న ప్రభుత్వాస్పత్రిలోనే చికిత్స చేయించుకోవాలని కోవిడ్ బాధితులను కోరారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ జైసింహారాథోడ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు యాదవ్ ఉన్నారు.