Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరుటౌన్
డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి తన జన్మదిన వేడుకలను శనివారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల తన నివాసంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, వినరు, శ్రీధర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా శనివారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీద రవీందర్, వైస్ చైర్మెన్ గ్యాదపాక నాగరాజు ఆధ్వర్యంలో హమాలీలకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మామిడాల నర్సింహులు, మోటకొండూరు వైస్ ఎంపీపీ ఇలెందుల మల్లేష్, సీనియర్ నాయకులు మొరిగాడి వెంకటేష్, జూకంటి ఉప్పలయ్య, పట్టణ యువజన నాయకులు బైరి మహేందర్, హేమేందర్, తదితరులు పాల్గొన్నారు.
డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు కుండే సంపత్, పూల శ్రావణ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై రమేశ్, సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ రాయపురం నర్సింహులు, పీఏసీఎస్ డైరెక్టర్ కుళ్ల సిద్ధులు, నాయకులు జింకల రామకృష్ణ, కమిటీకారి చింటు, శేఖర్, పోలీస్ సిబ్బంది స్వప్న, నరేష్, వెంకట్, కృష్ణ పాల్గొన్నారు.
మోటకొండూర్:డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. మండలానికి చెందిన టీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షులు బీస కృష్ణంరాజు ఆధ్వర్యంలో మహేందర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బైరోజు వెంకటాచారి, యంపాల సునీల్‌రెడ్డి, పన్నాల నవీన్‌రెడ్డి, జీవిలికపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
బొమ్మలరామరం : డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పీఏసీఎస్ చైర్మెన్ జి.బాలనర్సింహా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద హమాలీలు, రైతులకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షులు పొలగౌని వెంకటేష్‌గౌడ్, ఉపసర్పంచ్ జూపల్లి భరత్, గ్రామ శాఖ అధ్యక్షుడు బెజ్జంకి పాపిరెడ్డి, కట్ట శ్రీకాంత్‌గౌడ్, నాగిరెడ్డి లక్ష్మారెడ్డి, ఉప్పల నరసింహారెడ్డి, శాంతాచారి తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట:డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట మండలానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్‌గౌడ్ ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.
మహేంద్ర యువసేన ఆధ్వర్యంలో గొంగిడి మహేందర్‌రెడ్డి పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేంద్ర యువ సేన నాయకులు ముఖ్యర్ల సతీష్‌యాదవ్, జెడ్పీటీసీ తోటకూర అనురాధబీరయ్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మిట్ట వెంకటయ్య, నాయకులు ఆవుల సాయి తదితరులు పాల్గొన్నారు.
ఆలేరు రూరల్ : మండలంలోని గొలనుకొండ గ్రామంలో పీఏసీఎస్ చైర్మెన్ మొగలగాని మల్లేశం ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. హమాలీలకు శానిటైజర్, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భైరపాక లక్ష్మీ, ఎంపీటీసీ బాకీ లక్ష్మీ, తూర్పుగుడం సర్పంచ్ శ్రీశైలం, అడ్వకేట్ హరిబాబు, పీఏసీఎస్ డైరెక్టర్లు భిక్షపతి, నర్సింహులు, నాయకులు శ్రీపతి బుచ్చయ్య, బాపురెడ్డి, రాజు, ఉప్పలయ్య, ఆంజనేయులు, రమేష్, బాలరాజు, నర్సయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.