Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నల్లగొండ
గ్రామాల్లో కరోనా మహమ్మారి రెండో దశలో విజృంభిస్తున్ననందున ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలని నల్లగొండ రూరల్ ఎస్సై రాజశేఖర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో కోరారు. మండలంలో కొంతమంది పాజిటివ్ వచ్చినా, వైరస్ లక్షణాలు లేవని నిర్లక్ష్యంగా బయట తిరుగుతూ ఇతరులకూ వైరస్ వ్యాప్తి అయ్యేలా చూస్తున్నారని తెలిపారు. అలా ఎవరైనా వ్యవహరిస్తే 269,188 ఐపీసీ, డిజస్ట్రార్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారికి ఆరు నెలల పాటు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. పాజిటివ్ వచ్చినవారు తప్పనిసరిగా హోం ఐసోలేషన్లో ఉంటూ అధికారులు ఇచ్చిన మెడికల్ కిట్లను వాడాలని సూచించారు. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు.