Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భూదాన్‌పోచంపల్లి
రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని రైతు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు కోట రామచంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల వ్యాప్తంగా అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలనూ ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ రైతులు తీసుకొచ్చిన ధాన్యం ఏ గ్రేడ్‌గా భావించి కొనుగోలు చేయాలని కలెక్టర్ ప్రకటించినా ఇక్కడ అమలు కావడం లేదన్నారు. పైగా రైస్ మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ గ్రేడ్ ధాన్యాన్ని బి గ్రేడ్ ధాన్యంగా ఇస్తేనే తీసుకుంటామని రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఆయన వెంట ఆ పార్టీ నాయకులు మంచాల మధు, తదితరులు ఉన్నారు.