Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామన్నపేట:స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ వసతి లేక అనేకమంది పేషంట్లు ఇబ్బంది పడుతున్నారు. మండల కేంద్రానికి చెందిన అఫ్జల్ బయబీన్ మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు శనివారం స్థానిక ఏరియాస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు ఇక్కడ ఆక్సీజన్ సౌకర్యం లేదని తెలిపారు. నల్లగొండ ఆస్పత్రికి తరలించాలని సూచించడంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. 108లో ఇలాంటి కేసులు తరలించలేమని సిబ్బంది తేల్చి చెప్పారు. దీంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. స్థానిక విలేకర్ల సూచనతో మండల కోఆప్షన్ సభ్యులు యాసిన్ ఆమెర్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఫోన్లో సమాచారం అందించారు. ఆయన వెంటనే స్థానిక వైద్యులతో మాట్లాడి ఆస్పత్రికి సంబంధించిన అంబులెన్స్‌లో నల్లగొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించాలని ఆదేశించారు. అప్పటికే పేషెంట్ కోమాలోకి వెళ్లిపోయినట్టు సమాచారం. అక్కడ కూడా బెడ్స్ లేవని ఆస్పత్రి వర్గాలు తెలిపినట్టు సమాచారం. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో కరోనా రోగుల కోసం ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసినా ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో అనేక మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు.