Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కమ్యూనిస్టుల పుట్టినిల్లు కర్విరాల కొత్తగూడెం
అ నేడు బీఎన్ వర్థంతి
నవతెలంగాణ-సూర్యాపేట
'పువ్వు పుట్టగానే పరిమళ్లించినట్లు' ఆ బాలుడు భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికిని నోరులేని మట్టి మనుస్సుల కోసం ఉదయించిన సూర్యుడిగా వెలిగై నాలుగు దిక్కుల ప్రకాశించారు.వెట్టిబానిసలై బ్రతుకుతున్న బడుగు బతుకుకులకు భరోసా అయ్యడతను....దొరల భూస్వాముల ఆగడాలను ఎదిరించే ఆయుధమై పోరు జెండాయి పొలికేక అతడే అయితడని ఎవ్వరూ అనుకోలే..దొరల,భూస్వాముల ఆగడాలను చూసి ఉగ్ర రూపం దాల్చి ప్రళయ రుద్రుడై అగ్ని గుండంలోకి ఆయుధం పట్టుకొని దూకినాడు...శత్రువు గుండెల్లో సింహ స్వప్నమైనాడు...ఆయన ఎవ్వరో కాదు పులి బిడ్డా భీమిరెడ్డినర్సింహారెడ్డి.తుంగతుర్తి ప్రాంతం కరవిరాల కొత్తగూడెంలో ఒక భూస్వామ్య కుటుంభంలో పుట్టిన ఐదుగురు సంతానంలో పెద్దకొడుకు.సాయుధ పోరాటంలో తనతో పాటు ఉద్యమంలోకి ఆయుధం పట్టుకొని అన్న అడుగు జాడల్లో నడిచిన వీర వనిత స్వరాజ్యం స్వయానా ఆయన సోదరి 15 ఏండ్ల వయస్సులో తన తండ్రి గోరెంట్ల దొరతో రైతుల పక్షాన నిలబడి కలబడిన తీరు బిఎన్ ను ఎంతో ఉతేజ పరిచ్చింది... చుట్టుపక్కల గ్రామాలపై ఆ ప్రభావం పడింది. ఇంటికి వచ్చే పేద రైతులు వారిని ఆదరించే తల్లి తాపత్రయం చూసి ఆయనలో అన్యాయం మీద తిరుగుబాటు చేయాలనే బీజం పడింది.నల్లగొండలో చదువుతున్న సందర్భంగా వందే మాతరం నినాదం తో చిన్నతనంలోనే చిగురించిన నాయకత్వ లక్షణాలు.పెద్ద రైతుల ఇంటిలో పుట్టినప్పటికి కష్ట జీవుల బాధలు గాధలు, బరువులు, ఆకలి మంటలు కళ్లారా చూసి చలించారు. ఆయన ఇంట్లో మూగ పాలేరు ఉండే వాడు..చాలా బలవంతుడు..నాగలి దున్నడం, గడ్డి వాము వేయటం, బరువులు మోయడం, నారు మోయడం, బీఎన్తో సమానంగా చేసేవారు. ఎందుకో ఒక రోజు నీరసంగా కనిపించారు.రెండు రోజుల నుండి బువ్వ తినలేదని తలసి బీఎన్ చలించారు.అప్పుడు కష్టం చేసే వాళ్లకు తిండి ఎందుకు లేదు..ఎంత కాలం కష్టం చేయాలి, వాళ్ళ భవిష్యత్ ఏమిటి, వాళ్ళ పిల్లల సంగతి ఏమిటి అనే ప్రశ్నలు పేద ప్రజల పక్షాన నిలబడడానికి ప్రధాన భూమిక అయ్యింది.గోరెంట్ల గ్రామం నుండి దేవులపల్లి వెంకటేశ్వరరావు రహస్యంగా పంపిన కమ్యూనిస్ట్ సాహిత్యం,లెనిన్ రాసిన పల్లెటూరి పేదలకు లేఖ, మాక్సింగోర్కీ రాసిన అమ్మ నవల,1942 లో రాజారెడ్డి, తన సోదరి శశిరేఖ, ప్రియంవధతో కలిసి 9వ ఆంధ్రామహాసభకు హాజరైన అనుభవం తననుపెద్ద ప్రభావితం చేసింది.మొదటి సారి కామ్రేడ్ పదం విన్నారు.నిజాం వ్యతిరేక శక్తులందరిని ఆ సమావేశం పరిషయం చేసింది... అరుట్ల దంపతులతో పరిచయము కుదిరింది... వెట్టిచాకిరితో వత్తి కులాలను భూస్వాములు కట్టుబానిసలు గా చేసింది...స్వంత ఆస్తి లేక పోవడం, పొద్దున లేచిన దగ్గర నుండి నడి రేతిరిదాక భూస్వాముల ఇండ్లలో పని చేయాలి...కూలీ లేదు తిండి లేదు..అడిగేది లేదు.అడిగితే బ్రతికి బట్ట కట్టేదిలేదు.తాళ్లు ఉచితంగా గీయడం, బట్టలు ఉచితంగా ఉతకడం... ఉచితంగా బట్టలు నెయ్యట.. ఉచితంగా వ్యవసాయం చేయడం, ఆడవాళ్లు ఇండ్లలో పనిచేయడం. స్వంతపనులు అంటూ ఉండేవి కావు. ఇదే వెట్టి చాకిరీ ...ఇదంతా కూడా భీమిరెడ్డి పేద ప్రజల పక్షాన నిలవటానికి కారణమైంది.దేశం మొత్తం స్వాతంత్య్రం పొందిన సంబురాల్లో ఉంటే తెలంగాణ ప్రాంతం మాత్రం ఇంకా నిజాం ఎలుబడిలోనే ఉంది.మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దయాదక్షిణ్యాలతో పరిమిత అధికారాలతో మనుగడ సాగించిన నైజాం చక్రవర్తి.చివరికి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు తెలనొప్పిగా మారిండు.బ్రిటీిష్కు తొత్తుగా మారిండు.నిజాం రాష్ట్రంలో 2600 మంది జమీందార్లు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, దేశపాండేలు ఉన్నారు.వీరి ఆధీనంలో 10 వేల గ్రామాలు ఉండేవి.మొత్తం 5కోట్ల ఎకరాల సాగు భూమి ఉంది.ఇందులో ఒక కోటి 50 లక్షల ఎకరాల భూమి జమీందారు ల కింద ఉంది.అన్ని గ్రామాలపై సర్వహక్కులు వీరికే ఉండే.ప్రజలపై పన్నులు వేయడం, అన్ని వర్గాల ప్రజలతో వెట్టి చేయించుకోవడం,దౌర్జన్యం చేయడం... ఎదురుతిరిగితే శిక్షలు వేయడం..పొద్దునదాక పని చేయించుకోవడం...ఒకరకంగా ప్రజలకు ఏ హక్కులు ఉండేడివి కావు.ఈ ప్రభావం అంత బీఎన్ మీద పడింది. తెలంగాణలో అమలుచేస్తున్న లెవ్వి గళ్ళ విధానంపై పోరాటం తొలి పోరాటమైంది.
మొండ్రాయి ఘటన
లంబాడీల పంట పొలాలను కాజేయాలని కాడారి రామచంద్రరావు అనే దేశ్‌ముఖ్ నిజాం మిలట్రీని గిరిజనగూడెం మీదకు పంపించాడు.అది తెలిసి బీఎన్ దేవులపల్లి, యాదగిరిరావు వెళ్లి లాంబాడీలకు అండగా నిలబడి ధైర్యం ఇచ్చారు.మొండ్రాయి గ్రామంలో భూస్వామ్యగూండాలు ఇది రష్యా కమ్యూనిస్టులకు ఇది రష్యా కాదు రష్యా వెళ్ళిపోండి అని బ్యానర్ కట్టారు.
పాలకుర్తి పోరాటం బీఎన్‌కు స్ఫూర్తినిచ్చిన ఐలమ్మ తెగింపు
పాలకుర్తిలో ఒక సాధారణ మహిళ,తనకున్న రెండెకరాల భూమిలో భర్త కొడుకుతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ,వృత్తిని నమ్ముకొని జీవిస్తుంది.ఇసునూరు రామచంద్రారెడ్డి దేశ్‌ముఖ్ ఆగడాలు ఎదిరించా తన ఇంటినే పార్టీ కార్యాలయంగా మార్చింది.దొరల ఆగడాలు ఎదిరించి గ్రామం నడిబొడ్డున ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి రాకతో పెద్దసభ, వేలాది మంది జనం చుట్టూరా గ్రామాల పెద్దఎత్తున వచ్చారు.సహించలేని ఇసునూరు గూండాలు ఆరుట్లపై హత్య ప్రయత్నం చేశారు.ఐలమ్మ భర్త, కొడుకు గూండాలపై ఒకే పెట్టున దూకి అడ్డుకున్నారు. కానీ జరగాల్సిన సభ ఆగిపోయింది. ఐలమ్మ ధైర్యం, తెగింపు, పోరాడేతత్వం, గూండాలకు కంటాకింపుగా మారింది.ఎలాగైనా పొలం కాజేయలని కుట్ర, బెదిరింపులు, దౌర్జన్యం, ఒకటేమిటి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు.కామ్రేడ్ బీఎన్ దళం పాలకుర్తి చేరి పొలం కోసి ఇంట్లో పోసి అడ్డొచ్చిన ఇసునూర్ గూండాలను తరిమి కొట్టారు.ఈ పరిస్థితి దొరకు నిద్రపట్టలే, చుట్టూరా ఉన్న చిన్న చితకదొరలు, గూండాలను ఊరుచుట్టూ పెట్టుకుంది. బీఎన్దళం, కొంతమంది వాలంటీర్స్ అన్ని ప్రాంతాల నుండి వచ్చిన ఎర్రసైన్యం పెద్దఎత్తున దొర గడి ముందు పెద్దఊరేగింపు...ఎర్రజెండా జిందాబాద్, వెట్టిచాకిరి పోవాలి, దున్నేవానికే భూమి వంటి నినాదాలతో సాగుతున్న ఊరేగింపుపై గూండాలు దొంగచాటుగా గురిపెట్టి కాల్చారు.యువ నాయకుడు కొమురయ్య గుండెకు తూటా దిగి నెలకొరిగారు.తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డికొమురయ్య మరణంతో కామ్రేడ్ బీఎన్ ఉద్రుక్తుడై సింహాల నలువైపులా గర్జించాడు.పారిపోతున్న విసునూరు దొరల కచడాల వెంట బడి దొరికినోన్ని దొరికినట్టే గురిపెట్టి చావగొట్టారు.ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ ఎక్కడా అన్యాయం జరిగినా దొరగాల ఆగడాలు జరిగిన బీఎన్ సెంట్రల్ దళం దిగాల్సిందే.బీఎన్ ఎన్నో చిత్ర హింసలకు గురయ్యారు.జైలు జీవితం గడిపారు. ప్రాణాపాయ స్థితి నుండి క్షణాల్లో తప్పించు కున్నారు.పాతసూర్యాపేట, కోటపహాడ్,అనేక పోరాట ఘట్టాల్లో స్వయంగా న్యాయకత్వం వహించారు.తన చెల్లెలు స్వరాజ్యం కూడా చేరి ఆసాంతం అన్న బాటలో నడిచింది. దేవులపల్లిని తన గురువుగా ప్రకటించారు.ఆయన పోరాటం అనంతరం మూడుసార్లు ఎంపీగా,రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచారు.ఎడారిగా మారిన తుంగతుర్తి, సూర్యాపేట,జనగామ ప్రాంతాలకు పోచంపాడు రెండవ దశ కాలువనీళ్ల కోసం ఎన్నో పోరాటాలు చేశారు.చట్టసభల్లో పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.శ్రీరామ్‌సాగర్ రెండవ దశ కాలువకు తాను ఎంపీగా ఉండగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో తిరుమలగిరి వద్ద ప్రగతినగర్‌లో శంకుస్థాపన చేయించిన ఫలితంగానే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా జలయజ్ఞం పేరుతో శ్రీరామ్ సాగర్ రెండవదశకు కాలువలు తీయించడంలో బీఎన్ త్యాగం ఎంతో ఉంది.నేను బతికి ఉండగానే కాలువనీళ్లు చూడాలని,ఈ ప్రాంతంలో ప్రతి ఎకరం పచ్చని పంట పొలాలుగా ఎదగాలని కల నిజమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గోదారి నీళ్లు వచ్చాయి.ప్రతి బీడు భూమి మాగాణి అయ్యింది.రైతు కళ్ళల్లో ఆనందం చూస్తున్నామంటే భీమిరెడ్డి ఎర్రజెండా పట్టుకొని ప్రజలను సమీకరించి ఎన్నో ఏండ్లుగా ఉద్యమాలు చేసిన కారణంగానే ఈరోజు మనం చూస్తున్న కాలువలు...భీమిరెడ్డి తన కోసం కాకుండా ప్రజల కోసం బతికినోడు.చివరిదాకా కూడా అతి సామాన్య జీవితం గడిపారు.ఒక్కసారి సర్పంచ్ అయ్యినోడు భూమి మీద కాలు నిలవడం లేదు.ఆస్తి అంతస్తుల కోసం కాకుండా తనకున్న ఆస్తిని కూడా ప్రజాఉద్యమాలకు దారబోసిన వ్యక్తి...నీతి,నిజాయితీకి నిలువెత్తు విగ్రహం బీఎన్.సమాజంలో అందరికి సమానమైన అవకాశాలు రావాలని అది కమ్యూనిజం వల్లనే సాధ్యం అవుతుందని చివరిదాకా ఆదర్శంగా కమ్యూనిస్టుగానే బతికారు.సామాజిక ఉద్యమానికి సూర్యాపేట కేంద్రంగా జరిగిన ఉద్యమానికి పురుడు పోశారు.అలాంటి త్యాగాల చరిత్ర కలిగిన వీరుడు మరణం సామాజిక ప్రజాఉద్యమాలకు తీరని లోటు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా శ్రీరామ్సాగర్కాలువకు భీమిరెడ్డి నర్సింహారెడ్డి పెట్టి తెలంగాణ సాయుధ పోరాటానికి చిహ్నంగా నిలబెట్టాలని ఈ సందర్భంగా కోరుద్దాం... వారి ఆశయాలు సాధించిన వాళ్ళం అవుతాం... ఇప్పటికే కొంతమంది మహనీయుల పేర్లు యూని వర్సిటీలకు, జిల్లాలకు, ప్రాంతాలకు పెట్టారు. ఎంతోచరిత్ర కలిగిన మహనీయుని పేరు శ్రీరామ్‌సాగర్‌కు పెట్టి తెలంగాణ ప్రభుత్వం తన నిజాయితీని నిలబెట్టుకోవాలని ఆశిద్దాం... జోహార్ కామ్రేడ్ బిన్....సాధిద్దాం వారి ఆశయాలను..వారి వర్ధంతి సందర్భంగా...
నెమ్మాది వెంకటేశ్వర్లు
సీపీ(ఐ)ఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు
సూర్యాపేట జిల్లా....9848729533