Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
విద్యుత్ సరఫరాపై కొన్ని ఇబ్బందులున్నందున ప్రజల కోరిక మేరకు నూతన ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేశామని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పట్టణంలోని స్థానిక 26 వారులో విద్యుత్ లోఓల్టేజీ సమస్య ఉన్నందున రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి తెలియజేసిన వెంటనే మంత్రి ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయించారన్నారు.అందుకు అధికారులు కూడా వెంటనే 100 కెవి ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటుచేశారన్నారు.ఈ ట్రాన్స్ఫార్మర్ను శనివారం వార్డులో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,స్థానిక వార్డు కౌన్సిలర్ నిమ్మల స్రవంతి శ్రీనివాస్‌గౌడ్, ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పెద్దగట్టు దేవాలయ చైర్మెన్ కోడిసైదులుయాదవ్, కడారి అంజయ్య, కాసం రాము, లింగరాజు, అమరవాది శ్రవణ్, ఎలక్ట్రికల్ సిబ్బంది శ్రీరాములు,కష్ణ పాల్గొన్నారు.