Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సృష్టిలో తీయనైన పదం అ నేడు ప్రపంచ మాతృదినోత్సవం
సృష్టికి మూలం అమ్మ... ప్రేమకు ప్రతిరూపం అమ్మ... నవమాసాలు మోసి పురిటినొప్పులు ఓర్చుకొని, పేగు తెంచి జన్మనిచ్చి లోకాన్ని చూపించే మహనీయురాలు 'అమ్మ'... నేర్చుకున్న భాషకు తొలి పలుకు అమ్మ... కలుషితం లేనిది అమ్మ ప్రేమ...సృష్టిలో తీయనైన పదం అమ్మ...సృష్టిలో తీయనైన పదం అమ్మ... పిల్లల అభ్యున్నతి కోసం అనుక్షణం ఆరాటపడేది అమ్మ.. కొవ్వొత్తిలా కరిగిపోతూ బిడ్డల జీవితాల్లో వెలుగు చూపేది అమ్మ... నేడు 'ప్రపంచ మాతృ దినోత్సవం' సందర్భంగా ప్రత్యేక కథనం
వివరాలు 3లో
అమ్మా వందనం..
నవతెలంగాణ - మిర్యాలగూడ
ఢిల్లీకి రాజైనా..తల్లికి కొడుకేనన్నది ఒక సామెత. తల్లి తర్వాతే ఎవరైనా. లోకం లో దేవుడు లేడనేవారు ఉంటారు కానీ.. తల్లి లేదు అనే వారు ఎవరూ ఉండరు. అందుకే తొలి నమస్కారం తల్లికే చేస్తారు. మదర్స్‌డే వేడుకలను జరిపే సాంప్రదా యం అమెరికా నుంచి ప్రారంభమైంది. అయితే ఈ ఆలోచనకు బ్రిటన్‌కు చెందిన జూలియా వార్డ్హోవే అనే మహిళ శ్రీకారం చుట్టింది. జూలియా వార్డ్హోవే అనే సామాజిక కార్యకర్త 1870లో జరిగిన యుద్ధోన్మాదాన్ని నిరసిస్తూ శాంతిని కాంక్షి స్తూ మదర్స్‌డే జరపాలని కోరుకుంది. ఈ ఆలోచనకు అమెరికాకు చెందిన ఆన్ జార్విన్ అనే మహిళ ప్రేరణపొంది, అనేక కార్యక్రమాలకు పురుడు పోసింది. జార్విన్ మరణించిన తర్వాత ఆమె కూతురు అన్నా జార్విన్ తల్లి స్ఫూర్తితో 1908 మే 10న వెస్ట్ వర్జీనియాలోని గ్రాఫ్టన్‌లో తొలిసారిగా 'మదర్స్‌డే' నిర్వహించింది. 1914లో అమెరికన్ ప్రెసిడెంట్ ఉడ్రోవిల్సన్ మదర్స్‌డేను అధికారికంగా ప్రకటించారు. అంతర్యుద్ధంలో కొడుకులను కోల్పోయిన తల్లుల గౌరవార్థం మదర్స్‌డే జరుపుకోవాలని నిర్దేశించారు. ఆనాటి నుంచి ఏటా మే నెల రెండో ఆదివారం 'మదర్స్‌డే' జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. ఇందులోని స్ఫూర్తిని గమనించిన అనేక దేశాలు మాతృదినోత్సవాన్ని జరుపుతున్నాయి.