Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అ నత్తనడకన ఆన్లైన్ నమోదు అ రూ.వెయ్యి కోట్లకు పైగా రైతుల సొమ్ము చెల్లింపుల్లో ఆలస్యం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరిగింది. కరోనా కేసులు పెరిగి పోతున్నా, మానవ వనరుల ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ కొనుగోళ్లలో ఎక్కడ తేడా రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం ఎగుమతి, దిగుమతి వద్దనే కొంత ఆలస్యం జరుగుతోంది. రైస్ మిల్లుల్లో హమాలీల సమస్య కూడా అధికంగా ఉంది. కరోనా పేరుతో డ్రైవర్లు, హమాలీలు రాకపోయినా వారిని మెప్పించి అధికార యంత్రాంగం పనిచేయిస్తున్నారు. దీంతో ఏ రోజు కొనుగోలు చేసిన ధాన్యం ఆ రోజే మిల్లులకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.