Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
కరోనాపై ఇంటింటి సర్వే వేగవంతం చేయాలని తహసీల్దార్ శ్రీనివాసశర్మ శనివారం అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఏడో వార్డ్ బాలాజీ నగర్ లో ఇంటింటి సర్వేలో పాల్గొని మాట్లాడారు.కరోనా కేసులు ప్రతి వార్డులోని రోజురోజుకూ పెరుగుతున్నాయని, పెరగకుండా ఉండాలంటే ప్రజలు సహకరించాలన్నారు.మీ ఇంటి వద్దకు వచ్చిన సర్వే బందానికి మీ వివరాలు తెలిపి సహకరించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంట్లో నుంచి బయటకు రావాలని, కేసులు కట్టడి చేయడంలో ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్నారు.వారి వెంట వీఆర్వో జానీపాషా, ఆర్పీ ఎస్కె.ఫర్వీన్, వార్డు ఆఫీసర్ రమేశ్ పాల్గొన్నారు.
పెన్‌పహాడ్ :మండలపరిధిలోని లింగాల గ్రామంలో శనివారం కోవిడ్ 19 సర్వే కొనసాగింది.సర్వేలో భాగంగా గ్రామంలో అనారోగ్యంతో ఉన్న వారిని సర్వే ద్వారా నిర్దారిస్తున్నారు.ఇంటింటికి వెళ్ళి కరోనా లక్షణాలు అయిన జ్వరం, దగ్గు, జలుబు వంటివి ఎవరికైనా ఉన్నాయా..సోకినవారు ఎవరినైనా కలిశారా..?, మరికొన్ని అంశాలను గురించి ప్రధానంగా నిర్వహిస్తునట్లు, ముఖ్యమైన పనులకు తప్ప ఇంటి నుండి బయటకు రావద్దన్నారు. వచ్చినా మాస్క్ ధరించి సామాజికదూరం అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఆశావర్కర్ రణపంగ సుజాత, ఏఎన్ఎం షేక్నసీమా, గ్రామ కార్యదర్శి రమేశ్, అంగన్వాడీ టీచర్ వసంత పాల్గొన్నారు.
నేరేడుచర్ల : పట్టణంలోని పలు వార్డులలో ఆశా వర్కర్లు, వివికె వాలంటీర్స్‌తో కలిసి శనివారం సర్వే నిర్వహించారు.జ్వరం వస్తే ఎటువంటి చర్యలు తీసు కోవాలి..సామాజికదూరం, మాస్కులు వాడే విధానం, శానిటేషన్, విషయాలపై పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు.కరోనా వైరస్‌కు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలతో వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చన్నారు.
నూతనకల్: రోజురోజుకు కరోనా వ్యాప్తి చెందుతుండడంతో ప్రభుత్వ ఆదేశాల అనుసారం వైద్య సిబ్బంది చేసే ఇంటింటి సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీటీసీ పన్నాల రమామల్లారెడ్డి శనివారం ఒక ప్రకటనలో కోరారు.వైద్య సిబ్బంది చేసే ఇంటింటి సర్వేలో ఇంట్లోవారికి జ్వరం, దగ్గు, జలుబు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా దాపరికం లేకుండా సర్వే బందానికి తెలియజేయాలలన్నారు.
పెద్దవూర:మండలంలోని నాయినవానికుంటతండా గ్రామంలో కరోనా కట్టడి కోసం శనివారం ఇంటింటి సర్వే నిర్వహించారు.కరోనా కష్టసమయంలో గ్రామాన్ని సందర్శించి ఇంటింటి సర్వే చేపట్టి ప్రజలకు ధైర్యాన్ని, భరోసా కల్పిస్తున్న అంగన్‌వాడీటీచర్లకు, ఆశావర్కర్లకు గ్రామప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ నారాయణమ్మ, ఆశావర్కర్ లింగమ్మ పాల్గొన్నారు.
నాగార్జునసాగర్: నందికొండ పురపాలక సంఘంలో ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, పురపాలక సిబ్బంది సహాయంతో శనివారం ఇంటింటి సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ అనిత మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఇంటింటికీ వెళ్లి కరోనాకు సంబంధించిన లక్షణాలపై సిబ్బంది ఆరా తీస్తారని, ఈ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారన్నారు.ఈ సర్వేను ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.కలెక్టర్ సూచనల మేరకు సర్వేను త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
గరిడేపల్లి :ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి సుధీర్ అన్నారు.మండలంలోని కల్మల్చెర్వు ప్రాథమిక ఆరోగ్య కేంద్రపరిధిలోని గిరిజన గ్రామాలైన సోమ్లాతండా, శీత్లాతండా, లుంబాతండాల్లో కోవిడ్ ప్రబలిన దష్ట్యా తండాల్లో ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక బందాలుగా ఏర్పడి సర్వే నిర్వహించారు.ఈ సర్వేలో లక్షణాలున్న వారిని గుర్తించి వారికి కిట్లు పంపిణీ చేశామన్నారు.గ్రామంలో నున్న ప్రజలకు కోవిడ్ పట్ల అవగాహన కల్పించామన్నారు.సామాజికదూరం పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాల న్నారు.కోవిడ్నిర్ధారణ అయిన వారు హోంఐసోలేషన్లో 14 రోజులు ఉండాలని సూచించారు.లేనిచో వారి నుంచి ఇతరులకు కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగులోతు సోని, ఆరోగ్య సిబ్బంది, సూపర్వైజర్ దైద వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం శాంతమ్మ, ఆశా కార్యకర్త సరస్వతి, కార్యదర్శి నర్సరాజు పాల్గొన్నారు.
కరోనా కేసుల కట్టడికి సహకరించాలని లక్ష్మీపురం సర్పంచ్ కుసుమ వెంకటమ్మ శ్రీనివాసరెడ్డి కోరారు.శనివారం మండలపరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామ నలుమూలలా సోడియం హైప్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా కేసులు గ్రామాల్లో అధికంగా నమోదు కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.ప్రజలు అవసరమైతే తప్ప అనవసరంగా బయటకు రాకుండా ఉండాలన్నారు. ప్రజలు ఎవరికీ వారే స్వచ్ఛంద లాక్డౌన్ విధించుకొని గ్రామంలో కరోనా కేసులు నమోదు కాకుండా చూసుకోవాల్సిన భాధ్యత మనందరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జానకీ రాములు, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.