Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ - నకిరేకల్
మండల వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి నకిరేకల్ మార్కెట్, ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు నకిరేకంటి ఏసుపాదం మాట్లాడుతూ 20 రోజుల నుండి కేంద్రాల్లో పోసిన ధాన్యం కొనుగోలు చేయక పోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. అనంతరం నకిరేకల్ మార్కెట్లో ఉన్న పరిస్థితిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫోన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, నాయకులు బ్రహ్మదేవర రమేష్, రైతులు పాల్గొన్నారు.