Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
గర్భస్థ శిశువు మతి చెందిన సంఘటన బుధవారం జిల్లా కేంద్రంలోని ఏరియాస్పత్రిలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం,,, మోటకొండూరు మండలం వర్టుర్ గ్రామానికి చెందిన కొత్త విట్టల్ తన భార్య నవ్యతో కలిసి మొదటి కాన్పు కోసం జిల్లాలోని కేంద్రంలోని ఏరియాస్పత్రికి సోమవారం వచ్చారు. అదేరోజు ఆస్పత్రిలో అడ్మిన్ అయ్యారు. వైద్యులు ఆమెను పరీక్షించి పురిటి నొప్పులు వస్తున్నాయని సాధారణ కాన్పు అవుతుందని ఆస్పత్రిలోనే ఉంచాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేర్పించగా సాధారణ కాన్పు కాలేదు. ఉదయం నవ్వకు సిజేరియన్ ద్వారా కాన్పు చేసినప్పటికీ శిశువు అప్పటికే మతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సరైన సమయంలో కాన్పు చేయకపోవడంతో శిశువు మతి చెందినట్టు నవ్య భర్త విటల్ ఆరోపించారు. ఈ విషయంపై ఆయన ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్బ రవి ప్రకాష్ మాట్లాడుతూ కాన్పు కోసం మరో పది రోజుల సమయం ఉందని, కాన్పు కావడంతో మొదటగా సాధారణ కాన్పు కోసం ప్రయత్నం చేసినట్టు తెలిపారు.