Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిల్లర్లదే ఇష్టారాజ్యం
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ - భువనగిరి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 20 రోజులుగా నిల్వ ఉన్న ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని రైస్ మిల్లర్లు తమ ఇష్టారాజ్యంగా ధాన్యాన్ని తరుగుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ విమర్శించారు. బుధవారం స్థానిక సుందరయ్య భవన్లో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సమావేశం ఆన్లైన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మార్కెట్లో 20 రోజులుగా ధాన్యాన్ని రైతులు తీసుకొచ్చి ఎదురుచూస్తున్నారన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసి రైసుమిల్లులకు తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం ఉందన్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. 799 వరి ధాన్యాన్ని ప్రభుత్వం మొదటి గ్రేడ్‌గా నిర్ణయించినప్పటికీ మిల్లర్లు మాత్రం రెండవ గ్రేడ్‌గా నిర్ణయించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. కొనుగోలు నత్తనడక కొనసాగుతుండడం వల్ల ఒక్కొక్క ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు గుంపు లుగా ఉండటంతో మరింత విస్తతం కావడానికి అవకా శం ఉందన్నారు. రైతులు గుంపు లుగా ఉండకుండా ఎప్పటిక ప్పుడు ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు కావాల్సిన రెండు పంటలకు సంబంధించిన అన్ని చార్జీలు వెంటనే విడుదల చేయాలన్నారు. ధాన్యం కొనుగోలుతో పాటు చెల్లింపులు వెంటనే రైతులకు చేయాలన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండ మడుగు నరసింహ అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమం లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మటూరి బాల రాజు, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, దోనూరి నర్సిరెడ్డి. జిల్లా కమిటీ సభ్యులు రోడ్డు అంజయ్య, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, బోల్లు యాదగిరి బూరుగు కష్ణారెడ్డి,జల్లేల పెంటయ్య, మాయ కష్ణ దయ్యాల నరసింహ, సిర్పంగి స్వామి, అనగంటి వెంకటేష్, బొడ్డుపల్లి వెంకటేష్, పైళ లింగారెడ్డి, మద్దెల రాజయ్య, గుంటోజు శ్రీనివాసాచారి,గుండు వెంకట్ నర్సు పాల్గొన్నారు.