Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాక్డౌన్ కాలంలో పేద ప్రజలను ఆదుకోవాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, లాక్డౌన్ కాలంలో ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకోవాలని సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.బుధవారం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ జూమ్ సమా వేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రకటన లేకుండా, ప్రజలను అప్రమత్తం చేయకుండా లాక్డౌన్ ప్రకటిం చడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు.ఈ కాలంలో పేదలకు రేషన్ బియ్యం,17 రకాల నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు.గతేడాది మాదిరిగానే పేదల అకౌంట్లలో నగదు రూపంలో డబ్బులు జమ చేయాలన్నారు.కరోనా వైరస్ సెకండ్ వేవ్ విస్తతంగా విజంభించడంతో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతుంటే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. అకస్మాత్తుగా లాక్‌డోన్ ప్రకటించడంతో వలస కార్మికులు,కూలీలు జీవనం ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు.కరోనా లక్షణాలు కలిగిన ప్రజలు పరీక్షల కోసం హాస్పిటల్‌కు వెళితే కిట్స్ లేవని టెస్టులు చేయడం లేదన్నారు.కరోనా సోకిన వారు హాస్పిటల్‌కు వెళితే బెడ్స్,ఆక్సిజన్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆస్పత్రుల్లో రోగుల సంఖ్యకు అను గుణంగా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రైవేట్ ఆస్పత్రులు కూడా కరోనాకు ఉచితంగా వైద్యం చేయాలని డిమాండ్ చేశారు.కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న ఆశా,అంగన్వాడీ,సెకండ్ ఏఎన్ ఎంలకు వేతనాలు పెంచాలని కోరారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ అదేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదన్నారు.వ్యాక్సిన్ తీసు కోవడం కోసం ఆన్లైన్లో వస్తున్న సాంకేతిక సమస్యల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారన్నారు.వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కోరారు. ప్రతి మండల కేంద్రంలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసి తగిన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.కరోనా సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో ఐసోలేషన్ కేంద్రాలు, కోవిడ్ సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.ప్రజలను ఆదుకునేందుకు పార్టీ చేస్తున్న కషిని అందరూ అభినంది స్తున్నారన్నారు.ఇంకా ప్రజలను ఆదుకునేందుకు సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లులక్ష్మీ, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, ధీరావత్ రవినాయక్, జిల్లా కమిటీ సభ్యులు కోటగోపి, ఎల్గూరి గోవింద్, జె.నర్సింహారావు, చెరుకు యాకలక్ష్మి,వేల్పుల వెంకన్న, మట్టిపల్లి సైదులు,ధనియాకుల శ్రీకాంత్‌వర్మ, మేకన బోయిన శేఖర్, నాగారపు పాండు, శంకర్‌రెడ్డి, అనంతప్రకాష్,యాకోబు పాల్గొన్నారు.