Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
- టీఎస్‌యూటీఎఫ్ కార్యాలయంలో బ్లాక్‌డే
నవతెలంగాణ-నల్లగొండ
ప్రజలకు హాని కల్గించే చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. బ్లాక్‌డేలో భాగంగా బుధవారం నల్లగొండలోని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యాలయం ఎదుట నిరసన తెలిపి మాట్లాడారు. రైతులు, సామాన్య ప్రజలకు నష్టం చేసే మూడు వ్యతిరేక చట్టాలను తీసుకు రావడం సరికాదన్నారు. కోవిడ్ నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వమే ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శులు ఎం.రాజశేఖర్‌రెడ్డి జి.నాగమణి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సైదులు, పెరుమాళ్ల వెంకటేశం, బక్క శ్రీనివాసచారి, కోశాధికారి నర్రా శేఖర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు మురళయ్య, ఎం.శ్రీనివాసరెడ్డి, నర్సింహా, సోషల్ మీడియా కన్వీనర్ నలపరాజు వెంకన్న, మండల బాధ్యులు ఆశమల్ల నాగయ్య, అమరయ్య, సీహెచ్.రవీందర్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.