Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మినారాయణ
నవతెలంగాణ -నల్గొండిపాంతీయ ప్రతినిధి
ఐక్య పోరాటాల వారధి సీఐటీయూ అని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు చిన్న పాక లక్ష్మీనారాయణ ,ఉపాధ్యక్షులు ఎండి.సలీమ్ అన్నారు. ఆ సంఘం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆదివారం స్థానిక ఎలక్ట్రిసిటీ స్టోర్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం ఎదుట జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1970 మే 30న కలకత్తా నగరంలో రామమూర్తి ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షులుగా బీటీ రణధివే సీఐటీయూ ఏర్పడిందన్నారు. నాటి నుండి నేటి వరకు సంఘటిత ,అసంఘటిత రంగాల కార్మికులందర్నీ ఏకం చేసి అనేక పోరాటాలు నిర్వహించి విజయాలు సాధించిన ఘనత అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్పులు చేస్తూ కార్మికులను కట్టు బానిసలుగా చేస్తుందని విమర్శించారు. 44 కార్మిక చట్టాలు నాలుగు కోడ్లుగా విభజించి అనేక హక్కులను హరించిన వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో పనులు కోల్పోయిన భవన నిర్మాణ, హమాలీ ,ట్రాన్స్పోర్ట్ రంగాల కార్మికులందరికీ నెలకు రూ.7500 చొప్పున నగదు, 16 రకాల నిత్యావసర సరుకులు, 30 కిలోల బియ్యం అందించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండం పల్లి సత్తయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో అవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హశం, ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య ,ఎలక్ట్రిసిటీ స్టోర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కత్తుల యాదయ్య,సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ,పోలే సత్య నారాయణ, మల్లి బాబు, సాయి కుమార్,చింతకాయల సంతోష్,దాసారపు రమేష్, యాదగిరి రెడ్డి,రామలింగయ్య, శంకర్ వెంకన్న ,తదితరులు పాల్గొన్నారు.